ముహూర్తం ఖరారు! | - | Sakshi
Sakshi News home page

ముహూర్తం ఖరారు!

Jun 3 2026 12:57 AM | Updated on Jun 3 2026 12:57 AM

కాళేశ్వరం: కాకతీయులు, చాళులక్యులు 11 శతా బ్దంలో నిర్మించిన కాళేశ్వరం దేవస్థానం మరో సరికొత్త నిర్మాణాలకు వేదిక కానుంది. 1982కు పూ ర్వం శిథిలావస్థలో ఉన్న కాళేశ్వరాలయం..దినదినాభివృద్ధి చెందుతుంది. తాజాగా కాళేశ్వరాలయంలో రాతి నిర్మాణాలకు ఏప్రిల్‌ 20న సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి రూ.198కోట్ల వ్యయంతో భూమి పూజ చేసిన విషయం విధితమే. ప్రస్తుతం దేవస్థానంలోని నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ఈనెల 17న ఉదయం 8 గంటలకు శాస్త్రోక్తంగా విశేష పూజలతో పనులు ప్రారంభిస్తారని ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు స్వయాన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అంత్యపుష్కరాల ముగింపు కార్యక్రమంలో చెప్పారు. దీంతో కాళేశ్వరం దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చి కొంగొత్త రూపు దిద్దుకోనుంది.

రూ.198కోట్లతో ఇలా..

రూ.133.50కోట్లతో ఆలయ కాంప్లెక్స్‌లోని గర్భాలయం, అర్థమండపం, శిఖరం, నందులు, ధ్వజం, 11 ఉప ఆలయాలు, ప్రాకారం, ఆగ్నేయంలో పాకశాల, నైరుతిలో విజయగణపతి ఆలయం, వాయువ్యంలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, నాలుగు రాజగోపురాల నిర్మాణాలు చేస్తారు. ఈఓ కార్యాలయం, దేవస్థానం, దుకాణాల సముదాయం, ఎస్‌ఎస్‌ఆర్‌ కాటేజీ, సింగరేణి గెస్ట్‌హౌస్‌లు తొలిగిస్తారని తెలిసింది. రూ. 5కోట్లతో భూసేకరణ కింద సమీపంలోని కొన్ని గృహాలకు సంబంధించి తొల స్తారని సమాచారం. రూ.35.50కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు, భక్తులు వెయిటింగ్‌ షెడ్లు, షా పింగ్‌ కాంప్లెక్సులు, టిక్కెట్‌ కౌంటర్‌ హాల్‌, కల్చ రల్‌ సెంటర్‌, బ్యాంకు, ఎస్‌ఆర్‌ఆర్‌ కాటేజీ, ఈఓ కార్యాలయం, ప్రవేశ తోరణం, అభివృద్ధి పనులు చేస్తారు. రూ.6కోట్లతో గుండం చెరువు సుందరీకరణ చేస్తారు. రూ.18కోట్లతో ఆలయ అభివృద్ధి పనులతో పాటు నాలుగు ప్రధానకూడలి నుంచి ఆలయానికి చేరుకునే రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ పనులు ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టనున్నారు. ఆలయ ఆవరణలో భక్తుల దర్శనం కోసం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో బాలాలయం నిర్మించనున్నట్లు తెలిసింది.

ఏడాదిలో పూర్తికి ప్రణాళికలు

వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 6వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు ప్రభుత్వం నిర్వహించడానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తారని ప్రకటించారు. సంవత్సరం సమయం ఉన్న నేపద్యంలో పనులు త్వరగా ప్రారంభించడానికి యంత్రాంగం ప్రణాళికలు రూపొందించారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఆయన సతీమణి దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌లు ప్రత్యేక శ్రద్ధతో ఆర్కిటెక్చర్‌లతో పనులు చేపట్టడానికి చర్యలకు పూనుకున్నారు. ఇప్పటికే మ్యాప్‌లు సిద్ధం చేసినట్లు తెలిసింది.

త్వరలో శృంగేరికి..

త్వరలో ఈఓ మహేష్‌, ఉప ప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మలు శృంగేరి పీఠానికి వెళ్లనున్నారు. ఇప్పటికే సూత్రప్రాయంగా శృంగేరి పీఠం అనుమతులు తీసుకొని తొలిగింపు ప్రక్రియ మొదలుపెట్టనున్నామని అధికారుల ద్వారా తెలిసింది. గోదావరి పుష్కరాల వరకు కుంభాభిషేకం చేసి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న దేవాలయాల స్థానంలో పూర్తిగా రాతి నిర్మాణాలు జరుగతుండడంతో భక్తులు, స్థానికుల్లో అభివృద్ధిపైన ఆశలు పెరుగుతున్నాయి.

ఈనెల 17న కాళేశ్వరంలో

రాతి నిర్మాణాల పనులు ప్రారంభం

శృంగేరి పీఠాధిపతుల ఆదేశానుసారం తొలగింపు ప్రక్రియ

సంవత్సరంలో పనులు

పూర్తయ్యేలా చర్యలు

వచ్చే గోదావరి పుష్కరాలకు

ప్రారంభోత్సవాలు

Advertisement
 
Advertisement
Advertisement