● డీఈఓ రాజేందర్
భూపాలపల్లి అర్బన్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ని ర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ ది నోత్సవ వేడుకల్లో వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే త రాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించేందు కు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని సూ చించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ విజయపాల్‌రెడ్డి, సీఎంఓ రమేష్, 99 డేస్ యాక్షన్ ప్లాన్ జిల్లా నోడల్ అధికారి శ్రీకాంత్, జిల్లా సైన్స్ అధికారి స్వామి, సూపరింటెండెంట్ స త్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.


