శాంతిభద్రతల పరిరక్షణే ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల పరిరక్షణే ముఖ్యం

Jun 3 2026 12:57 AM | Updated on Jun 3 2026 12:57 AM

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

భూపాలపల్లి రూరల్‌: రాష్ట్ర అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు సేవలందిస్తుందని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్‌ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. పోలీస్‌శాఖలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్‌ అధికారులు, సిబ్బందికి ఎస్పీ చేతుల మీదుగా కఠిన సేవా పథకాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్‌ ఎస్పీ నరేష్‌ కుమార్‌, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌ రావు, డీపీఓ సిబ్బంది, ఆర్‌ఐలు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement