రామప్పలో సినిమా షూటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

రామప్పలో సినిమా షూటింగ్‌

Jun 2 2026 3:12 AM | Updated on Jun 2 2026 3:12 AM

వెంకటాపురం(ఎం): షైన్‌ స్టూడియో బ్యానర్‌ పై రూపొందుతున్న ‘ప్రొడక్షన్‌ నంబర్‌ నెం. 2 సినిమా షూటింగ్‌ను రామప్ప దేవాలయంలో సోమవారం మంత్రి సీతక్క తనయుడు సూర్య, రైస్‌ మిల్లర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ క్లాప్‌ కొట్టి సినిమా షూటింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షైన్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌ సినిమాను చిత్రీకరించడం అభినందనీయమన్నారు. యూనిట్‌ బృందంతో కలిసి రామప్ప రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్లు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ గిరిబాబు, ఎస్సై చల్లారాజు, ప్రొడ్యూసర్‌ వేణు యాదవ్‌, హీరో అజయ్‌, మూవీ డైరెక్టర్‌ నేరెళ్ల దేవేందర్‌, కో డైరెక్టర్‌ ఆర్య అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement