విద్యుత్ దీపాలతో ముస్తాబైన కలెక్టరేట్
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను పురస్కరించుకొని అధికారులు కలెక్టరేట్‌లో నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేశారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నేడు (మంగళవారం) జరిగే ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం 7.25గంటలకు కేటీపీపీ గోదావరి గెస్ట్‌హౌస్ నుంచి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాకేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్దకు బయలుదేరి కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిపి అమరవీరులకు పుష్పాంజలి ఘటిస్తారు. కలెక్టరేట్‌కు చేరిన అనంతరం పోలీసులతో గౌరవవందనం స్వీకరించి జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. శ్రీనివాస్‌రెడ్డి సోమవారం గోదావరి గెస్ట్‌హౌస్ చేరుకోగా భూపాలపల్లి ఆర్డీఓ హరికృష్ణ పూల మొక్క అందించి స్వాగతం పలికారు.


