జీవనాధారమే జీవం తీసింది! | - | Sakshi
Sakshi News home page

జీవనాధారమే జీవం తీసింది!

Jun 1 2026 4:01 AM | Updated on Jun 1 2026 4:01 AM

వల చుట్టుకుని మత్స్యకారుడి మృతి

రేగొండ: చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు కాళ్లకు వల చుట్టుకుని మృతిచెందిన ఘటన కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రానికి చెందిన కట్ల సతీష్‌ (33) గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో సతీష్‌ కాళ్లకు వల చిక్కుకోవడంతో చెరువులో మునిగి చనిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పరకాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య మౌళిక, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి త్రిలోక్‌నాథ్‌ రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement