బడిలో మట్టి కుండల వర్క్‌షాప్
కాళేశ్వరం: జిల్లాస్థాయి జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలను మహదేవపూర్ జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో మట్టి కుండల తయారీ వర్క్ షాప్‌తో ప్రారంభించారు. కుమ్మరివారితో కుండల తయారీ విధానాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి స్వామి మాట్లాడుతూ.. పర్యావరణానికి అనుకూలమైనటువంటి మట్టిపాత్రలు వాడాలని తెలిపారు. ప్రాచీన కాలంలో ఇంట్లో ప్రతీ వస్తువు మట్టితో తయారుచేసిన వంట పాత్రలు, నీటిని నిలువ చేసే పాత్రలు, ధాన్యం నిల్వచేసే కాగులు పేర్పులు మొదలగు మట్టిపాత్రలు ఉపయోగించేవారని తెలిపారు. దీంతో ప్రజలందరికీ మంచి ఆరోగ్యంతో పాటు కుటీర పరిశ్రమలు బలపడేవని తెలిపారు. నేటి సమాజంలో మట్టి పాత్రలన్నీ కనుమరుగైపోయాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాలుర పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం, బయోసైన్స్ జిల్లా ఫోరమ్ అధ్యక్షుడు బి.ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ హసీనభాను, ఉపసర్పంచ్ శ్రీజ, బాలికల పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం సరిత, పి.కల్యాణి, ఉర్దూ పాఠశాల హెచ్‌ఎం యాస్మిన్, వివిధ పాఠశాలల సైన్స్ టీచర్లు పాల్గొన్నారు.
ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు,
ఉపాధ్యాయులు


