గణపురం టు హైదరాబాద్
● బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర
గణపురం: గణపురం మండలకేంద్రం నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సు సర్వీసును భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శుక్రవారం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో మండలకేంద్రం నుంచి హైదరాబాద్‌కు నైట్‌హాల్ట్ బస్సు సేవలు ఉండేవని.. గత ప్రభుత్వంలో దానిని తీసి వేశారన్నారు. ప్రజల కోరిక మేరకు తిరిగి ప్రారంభించినట్లు చెప్పారు. గణపురం వయా ములుగు మీదుగా హనుమకొండ హైదరాబాద్ బస్సు వెళ్తుందన్నారు. ఈ సర్వీస్‌తో ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.


