కల్యాణం కమనీయం | - | Sakshi
Sakshi News home page

కల్యాణం కమనీయం

Feb 28 2026 7:18 AM | Updated on Feb 28 2026 7:18 AM

కల్యా

కల్యాణం కమనీయం

అశ్వవాహనం...పల్లకీసేవ

లక్ష్మీనరసింహస్వామిని ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్దిన అశ్వవాహనంపై వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాలతో పురవీధుల గుండా ఊరేగించారు. గ్రామస్తులు, భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా ఎదురుకోళ్లు కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారు, ఆండ్రాలు, లక్ష్మీ అమ్మవార్లను పట్టువస్త్రాలు, ఆభరణాలు, పూలతో అలంకరించి పల్లకీసేవలో ఆలయ ఆవరణలోని కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రభుత్వం తరఫున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దంపతులు, కలెక్టర్‌ రాహుల్‌శర్మ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. డప్పుచప్పుళ్లు, వాయిద్యాల నడుమ వేదమంత్రాల సాక్షిగా ఆలయ ప్రధాన అర్చకులు బుచ్చామచార్యులు ఆధ్వర్యంలో నరసింహుని కల్యాణం ఘనంగా నిర్వహించారు. కల్యాణం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి.. మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ విజయలక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్‌ నాయినేని సంపత్‌రావు, ఆలయ కార్యనిర్వహణాధికారి మహేష్‌, ఆలయ అర్చకులు బుచ్చమచార్యులు, శ్రీనాధచార్యులు, జిల్లా నాయకులు పున్నం రవి, పట్టెం శంకర్‌, వీరబ్రహ్మం, ధర్మకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

అశ్వవాహనంపై ఊరేగిన నరసింహుడు

కోటంచకు పోటెత్తిన భక్తజనం

రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతీ ఏటా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలతో స్వామి వారికి ధ్వజారోహణం, గరుడముద్ద పూజలు చేశారు. గరుడ ముద్దను అందుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.

కల్యాణం కమనీయం1
1/3

కల్యాణం కమనీయం

కల్యాణం కమనీయం2
2/3

కల్యాణం కమనీయం

కల్యాణం కమనీయం3
3/3

కల్యాణం కమనీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement