దసలి పట్టు రైతులు సాంకేతికంగా ఎదగాలి
కాళేశ్వరం: దసలి పట్టు రైతులు సాంకేతికంగా ఎదగాలని సెరికల్చర్ జాయింట్ డైరెక్టర్ జి.అనసూయ, జార్ఖండ్ రాష్ట్రం రాంచి శాస్త్రవేత్త శంకర్‌గిరి, కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్ అన్నారు. శుక్రవారం మహదేవపూర్ మండలకేంద్రంలోని సెరికల్చర్ కార్యాలయం వద్ద దసలి పట్టు రైతుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దసలి పట్టులో అధిక దిగుబడికి కా వాల్సిన చర్యలపై సవివరంగా వివరించారు. వారివెంట చెన్నూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు కిరణ్‌కుమార్, రజితతో పాటు మహదేవపూర్ సెరికల్చర్ అఽధికారి సమ్మయ్య పాల్గొన్నారు.
నిందితులను కఠినంగా
శిక్షించాలి
మల్హర్(కాటారం): నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో అగ్రవర్ణాల కుల దురహంకారానికి రజక కుటుంబానికి చెందిన రెండేళ్ల పసికంద బలికావడం అత్యంత హేయమైనచర్య అని.. నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ అన్నారు. మండలం కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కిరణ్ మాట్లాడారు. తక్షణమే నిందితులపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హైకోర్టు జోక్యం చేసుకుని జుడిషియల్ విచారణ జరిపించాలని కోరారు. బాధితులకు న్యాయం చేయాలన్నారు. కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభు త్వ ఉద్యోగం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కార్యదర్శి ఐత బాపు, తెలంగాణ రైతు పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ దాసరి రమేష్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కార్యవర్గ సభ్యులు దారకొండ సూర్య శంకర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసు పాల్గొన్నారు.
సంప్రదాయ దుస్తులు ధరించాలి
రేగొండ: మండలంలోని కొడవటంచ ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు విధిగా డ్రెస్ కోడ్ పాటించాలని ఆలయ చైర్మన్ నాయినేని సంపత్‌రావు, ఈఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం వచ్చే భక్తులు తప్పని సరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని తెలిపారు. మగవారు పంచె, కండువా, సీ్త్రలు చీర, లేదా పంజాబీ డ్రెస్ ధరించి వస్తేనే అంతరాలయ దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. అంతరాలయంలో దర్శనంకోసం వచ్చే వీఐపీ భక్తులకు రూ.1000, ప్రత్యేక దర్శనం కోసం రూ.200 టికెట్లు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: యువ భారత్ వరంగల్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలను శుక్రవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్‌ఐ సాంబమూర్తి, సంఘమిత్ర డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ హరికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సాంబమూర్తి మాట్లాడుతూ.. క్రీడలు మానసికోల్లాసం, శారీరక ధృడత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. భూపాలపల్లి, చిట్యాల, గణపురం, మహదేవపూర్ బ్లాక్‌లలో విజేతలైన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. జిల్లా స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి పైస్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెల్దండ సురేష్, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ జైపాల్, ఎస్‌జీఎఫ్ ప్రెసిడెంట్ రమేష్, పీడీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
దసలి పట్టు రైతులు సాంకేతికంగా ఎదగాలి
దసలి పట్టు రైతులు సాంకేతికంగా ఎదగాలి


