
వైభవంగా మహాలింగార్చన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా శ్రీమహాలింగార్చనశ్రీ పూజా కార్యక్రమాన్ని వైభవంగా వేద మంత్రోచ్ఛరణలతో నిర్వహించారు. బుధవారం ప్రదోషకాలంలో ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ, అర్చకులు వెల్ది శరత్‌చంద్ర, వేద పండితులు ప్రధాన ఆలయం అనివెట్టి మండపంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒండ్రు మట్టితో 365 మృత్తిక లింగాలను తయారుచేసి ప్రత్యేకంగా మహా రుద్రాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు చేశారు. ఈ పూజ చేయడం వల్ల సంవత్సర కాలం మహాశివుడికి పూజించిన ఫలం వస్తుందని భక్తుల నమ్మకం. అనంతరం చెన్నూరుకు చెందిన ప్రతాప మారుతి భజన మండలి కార్యక్రమం నిర్వహించారు. ఈఓ ఎస్.మహేశ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.