
నిలిచిన రాకపోకలు
చిట్యాల: మండలంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని పాశిగడ్డతండా–ఒడితల గ్రామాల మధ్య కొండెంగల కల్వ ర్టులో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో పాసిగడ్డతండాకు చెందిన ప్రజలు మండల కేంద్రానికి వచ్చే పరిస్థతి లేక ఇబ్బందులు పడ్డారు. వెంచరామి –అందుకుతండా గ్రామాల మధ్య కల్వర్టు వరద నీటితో ఉప్పొంగింది. బావుసింగ్‌పల్లి గ్రామం నుంచి ఎస్సీ కాలనీకి వెళ్లే తోళ్లమడుగు ఒర్రె ఉధృతంగా ప్రవహించింది. చల్లగరిగ– ముచినిపర్తి గ్రామాల మధ్య పంటపొలాల నుంచి వరద నీరు భారీగా వెళ్తుండడంతో రాకపోకలు నిలిచిపోయా యి. గిద్దెముత్తారం– లంబాడీతండా మధ్య ఉన్న కల్వర్టు గుండా వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాదారులు ఇబ్బంది పడ్డారు. తహసీల్దార్ షేక్ ఇమామ్‌బాబా, ఎంపీడీఓ జయశ్రీ, ఎస్సై శ్రావణ్‌కుమార్, ఎంపీఓ రామకృష్ణ అప్రమత్తంగా ఉండి గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.
మహాముత్తారంలో..
కాటారం: కాటారం, మహాముత్తారం మండలాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. మహాముత్తారం మండలంలో మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో జనజీవనం స్తంభించింది. మహాముత్తారం మండల కేంద్రానికి సమీపంలోని సబ్‌స్టేషన్ వద్ద గల కోనంపేట వాగు, కేశవపూర్–నిమ్మగూడెం మధ్య గల పెద్దవాగు వరద నీరు కాజ్‌వేలపై నుంచి ప్రవహించడంతో ఐదు గంటల పాటు అటు వైపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షంతో
ఉధృతంగా వరద ప్రవాహం
కల్వర్టులు, ఒర్రెల వద్ద ప్రమాదాలు
జరగకుండా అధికారుల చర్యలు

నిలిచిన రాకపోకలు

నిలిచిన రాకపోకలు