టేకుమట్ల: మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చైల్డ్ హెల్ఫ్‌లైన్ జిల్లా అధికారి కళావతి అన్నారు. శనివారం మండలంలోని రామకిష్టాపూర్(టి) అంగన్‌వాడీ కేంద్రంలో మహిళలకు చట్టాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం సుకన్య సమృద్ధియోజన, బేటీ బచావో–బేటీ పడావో, మిషన్ వాత్సల్య, చైల్డ్ హెల్ప్‌లైన్, సఖి కేంద్రాలను నిర్వహింస్తుందని అన్నారు. బాలికల చదువు అనంతరం వివాహానికి సుకన్య సమృద్ధి యోజన ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. బాలికలే భవిష్యత్‌కు పునాదులుగా బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం కొనసాగిస్తున్నారని అన్నారు. బాలికలు సమాజంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఇబ్బందులకు గురయితే చైల్డ్ హెల్ప్‌లైన్ తోడ్పాటునందిస్తుందన్నారు. మహిళలు కుటుంబ పరంగా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే సఖి కేంద్రం ద్వారా న్యాయం పొందే అవకాశం ఉందని చెప్పారు. చైల్డ్ హెల్ప్‌లైన్, బాలికల సమస్యల కోసం 1098, వృద్ధుల సమస్యల కోసం 14567, మహిళల సమస్యల కోసం 181 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సరోజన, సఖి గాయత్రి మిషన్ శక్తి కో ఆర్డినేటర్ అనూష, మమత, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.