చిట్యాల: మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన నల్ల అజయ్ రాష్ట్రస్థాయిలో 43వ ర్యాంక్ సాధించాడు. 2018లో కానిస్టేబుల్‌గా, 2024లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించిన అజయ్ ప్ర స్తుతం గ్రూప్–2లో స్టేట్ 43వ ర్యాంక్ సాధించాడు. అలాగే కాళేశ్వరం జోన్‌లో 7వ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా గ్రామస్తులు, బంధువులు అజయ్‌ను అభినందించారు.
సరస్వతీ పుష్కరాలపై
నేడు కలెక్టర్ సమీక్ష
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలపై గురువారం కలెక్టర్ రాహుల్‌శర్మ సమీక్ష నిర్వహించనున్నారు. బుధవారం హైదరాబాద్‌లో దేవాదా యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ అధ్యక్షతన కాళేశ్వరంలో మే 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతీ పుష్కరాలపై సంబంధితశాఖ అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష చేశారు. కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించాలనే ఆమె ఆదేశాలతో ఆయన సమీక్ష చేపట్టనున్నట్లు ఆలయ వర్గాల ద్వారా తెలిసింది.
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, హైదరాబాద్ ద్వారా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో నెల రోజులపాటు నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వనున్నట్లు హైదరాబాద్‌లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపా రు. శిక్షణ పూర్తయిన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. డిగ్రీ పూర్తయి 26 సంవత్సరాల కంటే తక్కువ వయ సు ఉన్న అభ్యర్థులు ఈనెల 15నుంచి ఏప్రిల్ 8 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి బీసీ అభ్యర్థులు మాత్రమే అర్హులని స్ప ష్టం చేశారు. పూర్తి సమాచారానికి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాల యం లేదా ఫోన్ నంబర్ 040–29303130 ద్వారా సంప్రదించాలని కోరారు.
ఇంటర్న్‌షిప్‌కు..
భూపాలపల్లి రూరల్: మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్న్‌షిప్‌కు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 745 జిల్లాలు, 25 సెక్టార్లలో 1.25 లక్షల కంటే ఎక్కువ ఇంటర్న్‌షిప్స్‌కు అవకాశం ఉందని తెలిపారు. యువత సొంత రాష్ట్రంలో లేదా ఇతర రాష్ట్రంలోనైనా 5 ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 1800 116 090 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. భూపాలపల్లి జిల్లాకు 23 ఇంటర్న్‌షిప్స్ కేటాయించినట్లు తెలిపారు. అభ్యర్థులు 21–24 మధ్య వయస్సు కలిగి ఉండాలని, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి 13, డిప్లొమో చేసిన వారికి 2, ఐటీ ఐ చేసిన 8 మందికి అవకాశం ఉందని తెలి పారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.5వేలు ఉపకార వేతనం అందుతుందని తెలిపారు.
దివ్యాంగులకు
ఉపకరణాల పంపిణీ
భూపాలపల్లి అర్బన్: భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ, సమగ్ర శిక్ష సౌజన్యంతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని భవిత కేంద్ర ఆవరణలో 99 మంది దివ్యాంగులకు రూ.9,88,200 విలువ గల వీల్ చైర్, ట్రై సైకిల్, చెవిటి మిషన్స్, రోలేటర్స్, టీఎల్‌ఎం కిట్స్, బ్రెయిలీ కిట్స్ అందజేశారు. కార్యక్రమానికి జిల్లా ఇంచార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరుకాగా ఈ కార్యక్రమంలో సీఎంఓ సామల రమేష్, ఎంపీడీఓ నాగరాజు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ప్రియవర్మ, సర్వన్‌కుమార్, తుపార్, రతన్‌సింగ్, సిబ్బంది పాల్గొన్నారు.


