
రేగొండలో దొంగల బీభత్సం
రేగొండ: రేగొండలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం అర్ధరాత్రి ఒక ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మండలకేంద్రానికి చెందిన సముద్రాల సురేష్ ఆచార్యులు– పద్మావతి దంపతులు మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉన్న కూతురు ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని 9 తులాల బంగారం, వెండి ఆభరణాలు, రూ.5 వేల నగదును ఎత్తుకెళ్లారు. దొంగలు ప్రహరీ దూకి పారిపోయే క్రమంలో శబ్ధం రావడంతో ఇంటి పక్కన ఉన్న యువకులు ప్రశాంత్‌చారి, భరత్ చూసి దొంగలను వెంబడించగా మసీదు దారి నుంచి పారిపోయారు. గ్రామంలోని వాటర్ ట్యాంక్ పక్కన ఖాళీ స్థలంలో అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనం పార్క్ చేసి ఉండటంతో పోలీసులు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సురేష్‌ఆచార్యులు గురువారం ఇంటికి చేరుకుని ఇంట్లో చూడగా 9 తులాల బంగారంతో పాటు, వెండి ఆభరణాలు, రూ.5 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఘటనా స్థలాన్ని చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ పోలీస్ సిబ్బంది, క్లూస్ టీమ్‌తో కలిసి ఫింగర్ ప్రింట్స్‌ను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.