దీపావళి సందర్భంగా ఇళ్లను శుభ్రం చేసి రంగులు వేయడంతో పాటు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమల్లో లక్ష్మీపూజలు నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూజా సామగ్రి, ప్రమిదలు, పూలు, పండ్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున దుకాణాలకు తరలివస్తున్నారు. పండుగ నేపథ్యంలో టపాసుల వ్యాపారం సైతం ఊపందుకుంది. అలాగే పండుగ వేళ పూలకు కూడా డిమాండ్ పెరిగింది. చామంతి, గులాబీ పూలు 50 గ్రాములకు రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. బంతిపూలు కిలోకు రూ.70 నుంచి రూ.100 పలుకుతోంది.
జనగామ పట్టణంలో పూలు కొనుగోలు చేస్తున్న ప్రజలు


