● డీఎంహెచ్‌ఓ డాక్టర్ వాణిశ్రీ
రఘునాథపల్లి: వైద్యులు, సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవల తీరును పరిశీలించారు. ఆస్పత్రి పరిధిలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనితీరు గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు సంరక్షణ కార్యక్రమాల ప్రగతిపై ఆరా తీశారు. గర్భిణులు, బాలింతలకు అందుతున్న వైద్య సేవల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో సిబ్బంది అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధుల్లో ఖచ్చితమైన సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామ్‌కిషన్, జయపాల్‌రెడ్డి, వైద్య సిబ్బంది ఉన్నారు.
వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయాలి
జనగామ రూరల్: పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా వై ద్య ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వైద్యాధికారులకు, మిడిల్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్, సూపర్‌వైజర్లకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ సకా లంలో గర్భవతుల నమోదు చేపట్టి సాధారణ ప్రసవాలు అయ్యేలా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


