నెమ్మదించిన ‘ఫారం–18’ ఆమోదం | - | Sakshi
Sakshi News home page

నెమ్మదించిన ‘ఫారం–18’ ఆమోదం

Nov 4 2026 1:26 AM | Updated on Nov 4 2026 1:26 AM

జనగామ: జిల్లాలో ఫారం–18 దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ మరింత వేగంగా జరగాలి. జిల్లాలోని 12 మండలాల పరిధిలో ఇప్పటి వరకు 27,512 దరఖాస్తులు అందగా, వాటిలో 8,335 మాత్రమే ఆమోదం పొందాయి. మరో 495 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 18,681 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

ఆమోదం పొందింది 30.3 శాతమే

జిల్లా వ్యాప్తంగా అందిన 27,512 దరఖాస్తుల్లో 27,508 ఆన్‌లైన్‌ ద్వారా, నాలుగు ఆఫ్‌లైన్‌ ద్వారా అందాయి. వీటిలో 8,333 ఆన్‌లైన్‌, రెండు ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కలిపి మొత్తం 8,335 ఆమోదం పొందాయి. మరో 495 దరఖాస్తులు తిరస్కరించగా, 18,680 ఆన్‌లైన్‌, ఒక ఆఫ్‌లైన్‌ దరఖాస్తు కలిపి 18,681 పెండింగ్‌లో ఉన్నాయి. అంటే ప్రతి 100 దరఖాస్తుల్లో సుమారు 30 మాత్రమే ఆమోదం పొందగా, దాదాపు 68 దరఖాస్తులు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు.

జనగామలోనే అత్యధిక పెండింగ్‌

మండలాల వారీగా పరిశీలిస్తే జనగామ మండలంలో అత్యధికంగా 6,422 దరఖాస్తులు అందాయి. వీటిలో 1,638 ఆమోదం పొందగా, 63 తిరస్కరణకు గురయ్యాయి. మరో 4,721 పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా పెండింగ్‌ దరఖాస్తులు ఉన్నది కూడా జనగామ మండలంలోనే. ఆ తర్వాత స్టేషన్‌ ఘన్‌పూర్‌లో 2,118, పాలకుర్తిలో 1,923, రఘునాథపల్లిలో 1,767, దేవరుప్పులలో 1,677 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఐదు మండలాల్లోనే భారీసంఖ్యలో దరఖాస్తులు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి.

పెండింగ్‌ తగ్గించడంపై దృష్టి సారించాల్సిందే

జిల్లాలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ దాదాపు పూర్తయినప్పటికీ, వాటి పరిశీలన, ఆమోదం ప్రక్రియలో వేగం పెరగాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి, రఘునాథపల్లి, దేవరుప్పుల మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. దరఖాస్తుల పెండింగ్‌కు గల కారణాలను గుర్తించి, సంబంధిత స్థాయిల్లో ఉన్న వాటిని త్వరితగతిన పరిష్కరించాలి. తిరస్కరించిన దరఖాస్తులను కూడా నిబంధనల ప్రకారం పరిశీలించాల్సిన అవసరం ఉంది.

మండలాల వారీగా పరిస్థితి ఇలా..

బచ్చన్నపేటలో 2,363 దరఖాస్తులు రాగా, 1,388 ఆమోదం, 66 తిరస్కరణ, 909 పెండింగ్‌లో ఉన్నాయి. చిల్పూరు:1,485 దరఖాస్తులు రాగా, 557 ఆమోదం, 62 తిరస్కరణ, 866 పెండింగ్‌. దేవరుప్పుల: 2,145 దరఖాస్తులు రాగా, 447 ఆమోదం, 21 తిరస్కరణ, 1,677 పెండింగ్‌. స్టేషన్‌ఘన్‌పూర్‌: 2,503 దరఖాస్తులు రాగా, 366 ఆమోదం, 18 తిరస్కరణ, 2,118 పెండింగ్‌. జనగామ: 6,422 దరఖాస్తులు రాగా, 1,638 ఆమోదం, 63 తిరస్కరణ, 4,721 పెండింగ్‌. కొడకండ్ల: 1,575 దరఖాస్తులు రాగా, 497 ఆమోదం, 44 తిరస్కరణ, 1,034 పెండింగ్‌. లింగాలఘణపురం: 2,124 దరఖాస్తులు రాగా, 933 ఆమోదం, 74 తిరస్కరణ, 1,117 పెండింగ్‌. నర్మెట: 1,136 దరఖాస్తులు రాగా, 441 ఆమోదం, 19 తిరస్కరణ, 676 పెండింగ్‌. పాలకుర్తి: 2,777 దరఖాస్తులు రాగా, 783 ఆమోదం, 71 తిరస్కరణ, 1,923 పెండింగ్‌. రఘునాథపల్లి: 2,311 దరఖాస్తులు రాగా, 507 ఆమోదం, 37 తిరస్కరణ, 1,767 పెండింగ్‌. తరిగొప్పుల:715 దరఖాస్తులు రాగా, 346 ఆమోదం, 8 తిరస్కరణ, 361 పెండింగ్‌. జఫర్‌గఢ్‌: 1,956 దరఖాస్తులు రాగా, 432 ఆమోదం, 12 తిరస్కరణ, 1,512 పెండింగ్‌లో ఉన్నాయి.

జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదు

దరఖాస్తులు 27,512

పెండింగ్‌లో 18,681..

తిరస్కరణకు గురైనవి 495

వేగం పుంజుకోవాల్సిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement