ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికలు | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికలు

Nov 4 2026 1:26 AM | Updated on Nov 4 2026 1:26 AM

● తాగునీరు, విద్యుత్‌ సరఫరాలో

అంతరాయం కలగొద్దు

● సమీక్షలో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

జనగామ: రాబోయే వేసవిలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీరు, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్‌, విద్యుత్‌ శాఖ, ఎంపీడీఓలతో తాగునీటి లభ్యత, వేసవిలో ఎదురయ్యే సమస్యలు, ముందస్తు చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 15 నుంచి వచ్చేనెల 31 వరకు తాగునీటి సరఫరా మౌలిక సదుపాయాల పనితీరును పరిశీలించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని తెలిపారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నీరు, విద్యుత్‌ వృథాను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కొత్త బోర్ల తవ్వకాలకు అనుమతులు ఇవ్వవద్దన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ బలరామరావు, మిషన్‌ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీకాంత్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సంపత్‌ రెడ్డి, మిషన్‌ భగీరథ గ్రిడ్‌ ఈఈ సూర్య, డీపీఓ వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మెరుగైన వైద్యం అందించాలి

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మాతా శిశు ఆస్పత్రి (ఎంసీహెచ్‌), ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ద్వితీయ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మాతా శిశు ఆస్పత్రిలో గదుల లభ్యత, ఇతర సేవల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించి, ఆన్‌లైన్‌లో గదులు బుక్‌ చేసుకునే విధానాన్ని 15 రోజుల్లోగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆస్పత్రుల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, నాణ్యతతో పనులు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌, డీఎంహెచ్‌ఓ వాణిశ్రీ, డీసీహెచ్‌ఎస్‌ సంధ్య, వై ద్యారోగ్య శాఖ అధికారులు, హెచ్‌డీఎస్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement