● టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్
జనగామ రూరల్: అన్ని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్(ఓపీ) సేవలు అందించి ప్రతి జిల్లాకు ఒక వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు ఎన్‌ఎన్ రాజు అధ్యక్షతన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా అన్ని ఆస్పత్రుల్లో ఇంకా వైద్యసేవలు అందుబాటులోకి రాలేదని, ఉద్యోగ ఉపాధ్యాయుల వేతనం నుంచి ప్రతి నెల 1.5శాతం చెల్లిస్తున్నప్పటికీ వైద్య సేవలు అందించడక పోవడం విచారకరమన్నారు. అలాగే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా పీఆర్సీ నివేదిక తెప్పించుకుని వెంటనే అమలు చేయాలన్నారు. ఎండీ అంకుశావళి, రాజారెడ్డి, యు.శ్రీహరి, వజ్రయ్య, సత్యనారాయణరెడ్డి, ఇమ్మడి అశోక్, శ్రీరామ్, లక్ష్మణ్, జి.వెంకటేశ్వర్లు, కనకయ్య, బి.శ్రీనివాస్, మల్లారెడ్డి గిరీష్, కాశీం, రాజయ్య, నాగభూషణం లచ్చిరాం, జి.శ్రీనివాస్, పి.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


