ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి రాత పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి రాత పరీక్ష

Nov 2 2026 1:11 AM | Updated on Nov 2 2026 1:11 AM

జనగామ రూరల్‌: జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని మిషన్‌ శక్తి, మిషన్‌ వాత్సల్య, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098లలో 13, అలాగే ఎంజేపీ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న 5 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఆదివారం కలెక్టరేట్‌లో ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పరీక్షల తీరును పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, జిల్లా ఉపాధి అధికారి కుమారస్వామి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌ పరీక్ష

జనగామ రూరల్‌: జిల్లాలో ఆదివారం నిర్వహించిన నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌) ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని మూడు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 692 మంది విద్యార్థులు పరీక్షకు కేటాయించబడగా, 659 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 95.23 శాతం హాజరు అయ్యారు. ధర్మకంచ పరీక్ష కేంద్రంలో 179 మందికి గాను 163 మంది హాజరు కాగా జనగామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 238 మందికి గాను 226 మంది హాజరు అయ్యారు. ఘన్‌పూర్‌ జెడ్పీఎస్‌ఎస్‌లో 275 మందికి గాను 270 మంది హాజరయ్యారు.

84 మంది జూనియర్‌

అసిస్టెంట్ల బదిలీలు

జనగామ: జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 84 మంది జూనియర్‌ అసిస్టెంట్లకు స్థానచలనం కలిగింది. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పాలన అధికారులుగా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురిని ఇతర గ్రామాలకు, మండలాలకు బదిలీ చేయగా, మరికొందరికి తహ సీల్దార్‌ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయం, కలెక్టరేట్‌లో జూనియర్‌ అసిస్టెంట్లుగా బాధ్యతలు అప్పగించారు. జీడికల్‌, మేకలగట్టు, ఉప్పుగల్‌, జఫర్‌గఢ్‌, చీటకొడూరు, గానుగుపహాడ్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌, తాటికొండ, పోతారం తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కొత్త పోస్టింగులు ఇచ్చారు. బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే విధుల నుంచి రిలీవ్‌ కావాలని, తమ వద్ద ఉన్న బాధ్యతలను 24 గంటల్లో అప్పగించి వెంటనే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

నవోదయ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి

జనగామ రూరల్‌: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు సంబంధించి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని మామునూరు, వరంగల్‌లోని పీఎంశ్రీ జవహర్‌ నవోదయ విద్యాలయం ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ టి.రమేశ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ఈనెల 28వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పేరు, ఫొటో, పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ, తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని తెలిపారు. ఏవైనా తప్పులు, వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

సంరిద్ధి పురస్కారానికి శ్రీధర్‌ ఎంపిక

దేవరుప్పుల: మహిళల ఆర్థిక స్వాతంత్య్రంపై సామాజిక చైతన్యం కలిగించే అంశాన్ని తీసుకొని మండల కేంద్రానికి చెందిన శ్రీధర్‌ ప్రతిష్టాత్మకమైన సంరిద్ధి పురస్కారానికి ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ వైస్‌ చైర్‌పర్సన్‌, డైరెక్టర్‌ జనరల్‌, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంరిద్ధి’ కార్యక్రమంలో ఈ ఘనత సాధించారు. దేశవ్యాప్తంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికా రులు, ప్రొఫెసర్లు, ఇతర సీనియర్‌ అధికారులు రచించిన సుమారు 1,500 శీర్షికల్లో కేవలం 15 శీర్షికలు మాత్రమే ప్రజంటేషన్‌కు ఎంపికయ్యా యి. శ్రీధర్‌ రచన అగ్రస్థానంలో నిలిచి పోటీలో పాల్గొన్న ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. శ్రీధర్‌ రచనను అభినందించిన శాంతికుమారి ప్రశంసించడంతో పాటు, ఈ శీర్షికను ప్రతి ష్ఠాత్మక ‘సంరిద్ధి’ ప్రచురణలో ముద్రించేందుకు కమిటీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement