పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి గంట సుహాస్య జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై ంది. ఇటీవల జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–17 అథ్లెటిక్స్ పోటీల్లో విద్యార్థిని గంట సుహాస్య పాల్గొని 200 మీటర్ల పరుగు పందెంలో ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. అలాగే అండర్–16 లో 60 మీటర్ల పరుగు పందెంలో కూడా ప్రతిభను చాటి జాతీయ స్థాయికి ఎంపికై ంది. ఒకేసారి రెండు క్రీడా వేదికలపై జాతీయస్థాయి పోటీలకు సుహాస్య ఎంపిక కావడంపై ఉపాధ్యాయులతో పాటు విద్యార్థిని గ్రామస్తులు అభినందించారు.


