సోమవారం శ్రీ 2 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 2 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

Nov 2 2026 1:11 AM | Updated on Nov 2 2026 1:11 AM

న్యూస్‌రీల్‌

జనగామ: ఎల్‌నినో ప్రభావం ఇంకా పూర్తి స్థాయిలో పడకముందే సన్నబియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. వచ్చే పంటల సాగుపై వాతావరణ ప్రభావం ఉంటుందనే అంచనాలను సాకుగా చూపుతూ వ్యాపారులు బియ్యం ధరలను అమాంతం పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పంటల సాగు కొనసాగుతుండగా, ధాన్యం నిల్వ లకు కొరత ఏర్పడిందనే స్పష్టమైన ఆధారాలు లేకుండానే ధరలు పెరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో బియ్యం నిల్వలు ఎంత ఉన్నాయి, ధరలు పెరగడానికి అసలు కారణమేంటి, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అనే అంశాలపై పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సన్నబియ్యం ధరల కట్టడికి నడుం బిగించింది. తాము ప్రకటించిన ధరలకు మించి అమ్మితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది.

జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచే దిగుమతులు

జిల్లాకు నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ జిల్లాలతో పాటు మిర్యాలగూడ, కోదాడ, కేసముద్రం, జమ్మికుంట తదితర ప్రాంతాల నుంచి సన్నబియ్యం దిగుమతి అవుతోంది. జిల్లాలో సన్న బియ్యం హోల్‌సేల్‌ దుకాణాలు ఐదు ఉండగా, కిరాణా దుకాణాల్లో రిటైల్‌ విక్రయాలు చేసే దుకాణాలు సుమారు 300 వరకు ఉన్నాయి. రేషన్‌ దుకాణాల్లో సన్నబియ్యం ఉచిత పంపిణీ ప్రారంభమైన తర్వాత నాలుగు నెలల పాటు ప్రైవేట్‌ మార్కెట్‌లో వీటి అమ్మకాలు తగ్గాయి. అయితే ఆరు నెలలుగా తిరిగి డిమాండ్‌ పెరగడంతో వ్యాపారుల విక్రయాలు పుంజుకున్నాయి. ఏడాది, మూడు నెలల క్రితం, ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలిస్తే బియ్యం రకాలన్నింటిలోనూ పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా జైశ్రీరామ్‌, బీపీటీ రకాల ధరలు వినియోగదారులకు భారంగా మారాయి.

పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం

రేషన్‌ దుకాణాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని జిల్లాలో 85 నుంచి 90 శాతం కుటుంబాలు వినియోగించుకుంటున్నాయి. అయితే కుటుంబ అవసరాలకు రేషన్‌ బియ్యం సరిపోకపోవడంతో అదనంగా ప్రైవేట్‌ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలకు 30 నుంచి 40 కిలోల బియ్యం అవసరం. పెరిగిన ధరలతో నెలకు అదనంగా రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.

అధికారుల తనిఖీలు తప్పనిసరి

గత సీజన్‌లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంతో పాటు ప్రైవేట్‌ వ్యాపారులు సైతం అధిక శాతం ధాన్యాన్ని క్వింటాలుకు రూ.2 వేలలోపు, ఆపై ధరలకు కొనుగోలు చేశారు. ప్రస్తుత సీజన్‌లో ధాన్యం ధరలు పెరిగినా, గతంలో కొనుగోలు చేసిన నిల్వలతో తయారైన బియ్యాన్ని ఇప్పుడు భారీ ధరలకు విక్రయించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని హోల్‌సేల్‌ గోదాములు, రైస్‌ మిల్లులు, బియ్యం దుకాణాల్లో నిల్వల వివరాలను అధికారులు సేకరించాలని కోరుతున్నారు. తనిఖీలు చేపట్టి కృత్రిమ కొరతకు అడ్డుకట్ట వేయడంతో పాటు ధరల పెరుగుదలకు కారణాలను వెల్లడించాలని వినియోగదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఎల్‌నినో ప్రభావం పేరుతో

సన్నబియ్యం ధరల పెంపు

ఏడాది కాలంలో క్వింటాలుకు రూ.2వేల వరకు పెరుగుదల

మూడు నెలల్లోనూ భారీగా పెరిగిన ధరలు

సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం

ధరల కట్టడికి ప్రభుత్వం చర్యలు

ధరల నియంత్రణపై

అధికారుల దృష్టి

కృత్రిమ కొరత సృష్టించి సన్నబియ్యం ధరలను అడ్డగోలుగా పెంచుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో జిల్లాలో సన్నబియ్యం విక్రయ ధర ఎంత ఉండాలి, వ్యాపారులు, మిల్లర్ల వద్ద ఎంత నిల్వ ఉంది, ఎక్కడైనా అక్రమ నిల్వలు ఉన్నాయా, కృత్రిమ కొరత సృష్టించకుండా ఎలాంటి తనిఖీలు నిర్వహిస్తారు.. ధరల నియంత్రణకు ఎలాంటి మార్గదర్శకాలు అమలు చేస్తారు అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

బియ్యం రకం ఏడాదిక్రితం 3 నెలలక్రితం ప్రస్తుతం

బీపీటీ 4,600 4,800 6,600

ఆర్‌ఎన్‌ఆర్‌ 6,000 6,600 7,500

జైశ్రీరామ్‌ 6,000 6,600 8,200

స్టీమ్‌ హెచ్‌ఎంటీ 5,500 6,500 7,500

స్టీమ్‌ బీపీటీ 5,500 – 6,600

నూకలు 3,000 – 4,000

కఠిన చర్యలు తీసుకోవాలి..

కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నాం. ప్రతీ నెల 16 కిలోల రేషన్‌ బి య్యంతో పాటు అదనంగా 25 కిలోల బియ్యాన్ని కొనుగోలు చేస్తాం. ధరలు భారీగా పెరగడంతో అదనపు భారం పడుతోంది. నాకు వచ్చే కొద్దిపాటి వేతనంతో కుటుంబాన్ని వెళ్లదీయలేక అవస్థలు పడుతున్నాం. బియ్యం ధరలు తగ్గేలా అధికారులు చర్యలు చేపట్టాలి.

–బొమ్మెన శ్రీనివాస్‌, బచ్చన్నపేట

పెరిగిన ధరలతో భారం

సన్నబియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. కుటుంబంలో ఆరుగురు సభ్యులం ఉన్నాం. బియ్యం ధరలు పెరగడంతో పోషణ భారంగా మారింది. కూలీ పనులపైనే కుటుంబ పో షణ ఆధారపడి ఉంది. ప్రతి నెల రేషన్‌ నుంచి వచ్చే 36 కేజీల రేషన్‌ బియ్యం సరిపోవటం లేదు. దీంతో ప్రైవేటు మార్కెట్‌లో బియ్యం కొంటున్నాం.

–తాటికాయల బాబు, జఫర్‌గఢ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement