‘సీ్త్రనిధి’
యాప్..
లింగాలఘణపురం: మహిళా స్వయం సహాయక సంఘాల్లో సీ్త్రనిధి రుణాలు తీసుకొనే సంఘ సభ్యుల రుణాల చెల్లింపులో ఇక నుంచి అక్రమాలకు తావులేకుండా చెక్ పెట్టనున్నారు. సెర్ప్ తీసుకొచ్చిన శ్రీమన సీ్త్రనిధి యాప్‌శ్రీతో ప్రతీ సభ్యురాలు నేరుగా తాము తీసుకున్న రుణాల చెల్లింపులో నేరుగా బ్యాంక్‌లోనే జమ చేసుకొనే అవకాశం కల్పించింది. గతంలో రుణం తీసుకున్న సభ్యురాలు సమావేశం రోజు సంఘం అధ్యక్షురాలు సమక్షంలో సీఏలకు చెల్లించడం జరిగేది. దీంతో అధ్యక్షురాలు ఆ డబ్బులను బ్యాంక్‌కు వెళ్లి సంఘం ఖాతాలో జమ చేయాల్సి ఉండేది. ఆ సమయంలో అధ్యక్షురాలు సభ్యులు చెల్లించిన డబ్బులు జమ చేయకుండా, ఒక వేళ తక్కువ జమ చేసిన సభ్యులకు బ్యాంక్‌కు వెళ్తే గాని తెలిసేదీ కాదు. దీంతో అక్రమాలకు అవకాశం కలిగేది. కొన్ని చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో మన సీ్త్రనిధి యాప్‌ను తీసుకొచ్చింది.
చెల్లింపులు..బకాయిలు..
మన సీ్త్రనిధి యాప్‌తో నేరుగా సభ్యురాలే తాను తీసుకున్న రుణం చెల్లింపుల లావాదేవీలను జరుపుకొనే అవకాశం ఏర్పడింది. యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే తాను తీసుకున్న అప్పు వివరాలు, చెల్లింపులు, ఇంకా ఎంత బకాయి ఉంది..ఏ సభ్యులు ఎంత చెల్లించింది.. అనే ప్రతి వివరాలను అందులోనే చూసుకోవచ్చు. అంతేకాకుండా సీ్త్రనిధి రుణం కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా ఉంటుంది. దీంతో సీ్త్రనిధి రుణాల వివరాలన్నీ డిజిటలైజ్ చేయడం జరుగుతుంది.
జిల్లా వ్యాప్తంగా ఇలా..
జిల్లాలోని 12 మండలాలు, ఓరుగల్లు టీఎల్‌ఎఫ్ మెప్మాతో కలిసి జిల్లాలో 13,739 స్వయం సహాయక సంఘాలు ఉండగా అందులో 1,49,841 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 4,849 సంఘాల్లో 22,137 మంది సభ్యులు సీ్త్రనిధి రుణాలను తీసుకున్నారు. ఇందులో 4,010 సంఘాల్లోని 6,513 మంది సభ్యులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంకా 9,694 సంఘాలు, అందులోని 1,43,328 మంది సభ్యులు సీ్త్రనిధి రుణాలను తీసుకోకుండా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకుండా ఉన్నారు. స్వయం సహాయక సంఘంలోని సభ్యులందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల సీ్త్రనిధి సేట్ జనరల్ మేనేజర్ రాము, జిల్లా అసిస్టెంటెంట్ మేనేజర్ నిర్మల జిల్లాలో పర్యటించారు.
‘మన సీ్త్రనిధి’ పేరిట యాప్ తీసుకొచ్చిన సెర్ప్ నేరుగా బ్యాంక్ అకౌంట్లలో రుణాల చెల్లింపు రుణ వివరాలు తెలుసుకొనే అవకాశం సభ్యులకు అవగాహన కల్పిస్తున్న యంత్రాంగం


