జనగామ రూరల్: జిల్లా చారిత్రక, సాంస్కృతిక విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జిల్లా పర్యాటక అధికారి ఎన్‌ఎల్ నరసింహారావు సూచించారు. శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక ప్రాధాన్యం, జిల్లా చారిత్రక, సాంస్కృతిక విశిష్టతను ప్రజలకు తెలియజేసే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. యువ టూరిజం క్లబ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. అండర్–20 షాట్‌పుట్ విభాగంలో పుదుచ్చేరిలో నిర్వహించిన సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో మూడో స్థానం సాధించిన సునీత్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఐఈఓ జితేందర్‌రెడ్డి, రెడ్డి రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ చేతుల మీదుగా నగదు పురస్కారం
జఫర్‌గఢ్: మండలంలోని తమ్మడపల్లి (జి) ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని గాదె శ్రీజ పదో తరగతిలో మండలంలో టాపర్‌గా నిలిచినందుకు గవర్నర్ శివప్రతాప్‌శుక్లా చేతుల మీదుగా రూ.50 వేల నగదు పురస్కారాన్ని అందుకున్నట్లు ప్రధానోపాధ్యాయుడు సీతారామయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శ్రీరాం గ్రూప్ సంస్థ వారు ప్రకటించిన రూ.50 వేల నగదు పురస్కారాన్ని గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ విద్యార్థినికి పురస్కారం అందించారన్నారు. ఈసందర్భంగా విద్యార్థినిని ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.
ఇందిరమ్మ లబ్ధిదారులకు న్యాయం చేయాలి
జనగామ రూరల్: డబల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలు ఇచ్చిన మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులు 72 మందికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చొరవ తీసుకుని న్యాయం చేయాలని సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కళ్యాణం లింగం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. బూడిది గోపి, అజారు ద్దీన్, బాల్నె వెంకట మల్లయ్య, పల్లెర్ల లలిత, పగిడిపల్లి బాలమణి, పందిళ్ల కళ్యాణి, ప్రశాంత్, శ్రావణ్, జయ వరలక్ష్మి పాల్గొన్నారు.


