● డీసీపీ రాజమహేంద్రనాయక్
జఫర్‌గఢ్: నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో దోహదం చేస్తుందని డీసీపీ రాజమహేంద్రనాయక్ పేర్కొన్నారు. సుస్త్రో ఆయిల్ కంపెనీ ఉప్పుగల్లు వారి సహకారంతో మండలంంలోని 14 గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ రాజమహేంద్రనాయక్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. గ్రామాల్లో జరుగుతున్న దొంగతనాలు, నేరాల తీరును తెలుసుకోవడంతో పాటు నేరస్తులను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు, షాపుల యాజమానులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సుస్త్రో ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ అధినేత సంతోష్ జగ్ధని, సీఎస్‌ఆర్ హెడ్ సురేష్ రోండా, జనరల్ మేనేజర్ సుబ్బారెడ్డి, పబ్లిక్ రిలేషన్ విజయ్‌కుమార్ నాయర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కుమార్‌రాజా, హెచ్‌ఆర్ హెడ్ ధనవర్మ, ఎస్సై బి.రామారావు, సర్పంచ్‌లు కొడారి సాంబరాజు, పులి సమ్మయ్య, మమత సోమన్నతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


