నేడు మంత్రి పొంగులేటి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

Sep 26 2026 1:14 AM | Updated on Sep 26 2026 1:14 AM

● పలు అభివృద్ధి కార్యక్రమాలకు

ప్రారంభోత్సవం

● మంత్రి పర్యటనకు పట్టణవ్యాప్తంగా స్వాగత తోరణాలు.. భారీ కటౌట్లు

● కొమ్మూరి ఆధ్వర్యంలో

సన్నాహక సమావేశం

జనగామ: జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఈనెల 26న (శనివారం) మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మంత్రికి స్వాగతం పలికేందుకు పట్టణంలోని ప్రధాన మార్గాల్లో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొ మ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణిశ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌, చెంచారపు కరుణాకర్‌రెడ్డి, మేడ శ్రీనివాస్‌, దోర్నాల వెంకటేశ్వర్లు, గాదెపాక రామచందర్‌ తదితరులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి పర్యటనకు ప్రజలు, ఇందిరమ్మ మహిళా లబ్ధిదారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొమ్మూరి పిలుపునిచ్చారు. మరోవైపు మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ బాలమణి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు ఏర్పాట్లను పరిశీలించారు.

మంత్రి పర్యటన ఇలా..

ముందుగా మున్సిపల్‌ కార్యాలయంలో అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం పట్టణంలోని 13వ వార్డులో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభకు హాజరుకానున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

అభివృద్ధి, సంక్షేమ పనులకు శ్రీకారం

జనగామ మున్సిపాలిటీకి రూ.1.77 కోట్ల విలువైన 16 చెత్త సేకరణ ఆటోలు, జేసీబీని జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే 54 మంది శానిటరీ వర్కర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లకు నియామక పత్రాలు అందజేస్తారు. రూ.2 కోట్లతో నిర్మించిన డంపింగ్‌ యార్డు షెడ్‌, మెషినరీ, రూ.38 కోట్లతో చేపట్ట నున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ (ఎస్‌టీపీ) పనులకు శంకుస్థాపన చేస్తారు. తరిగొప్పుల మండలంలో రూ.2.25 కోట్లతో నిర్మించిన తహసీల్దార్‌ కార్యాలయ భవనం, బచ్చన్నపేట మండలం కట్కూర్‌లోని జెడ్పీహెచ్‌ఎస్‌, ఎంపీపీఎస్‌ పాఠశాలల్లో రూ.38.75 లక్షలతో చేపట్టిన మరమ్మతు, పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తారు. పోచన్నపేట ఎంపీపీఎస్‌లో రూ.24 లక్షలు, రామచంద్రాపురం ఎంపీపీఎస్‌లో రూ.23 లక్షలు, కోర్టు సమీపంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో రూ.20 లక్షలతో చేపట్టనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. జిల్లాలోని 12 కేజీబీవీలు, 15 పీఎంశ్రీ పాఠశాలలు, 28 జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలల్లో రూ.1.92 కోట్లతో అవుట్‌డోర్‌ బాస్కెట్‌బాల్‌ కోర్టుల నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. జీజీహెచ్‌లో రూ.19.25 లక్షలతో అంతర్గత సీసీ రోడ్డు, చంపక్‌హిల్స్‌ ఎంసీహెచ్‌లో రూ.7.35 లక్షలతో ఆక్సిజన్‌ ప్లాంట్‌కు సీసీ రోడ్డు, పార్కింగ్‌ ప్రాంతంలో గ్రావెల్‌, యూజీడీ పనులు ప్రారంభిస్తారు. ఐడీఓసీ వద్ద రూ.10 లక్షలతో పార్కింగ్‌ టైల్స్‌, ఫెన్సింగ్‌, రూ.31 లక్షలతో ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. మున్సిపాలిటీ పరి ధిలో 99 మంది డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. 500 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement