పింఛన్‌ దరఖాస్తులు..11,826 | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ దరఖాస్తులు..11,826

Sep 21 2026 12:56 AM | Updated on Sep 21 2026 12:56 AM

కేటగిరీల వారీగా వచ్చిన దరఖాస్తులు

జనగామ: జిల్లాలో కొత్తగా సామాజిక భద్రత పింఛన్ల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 11,826 దరఖాస్తులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో వితంతు పింఛ న్ల కోసం వచ్చిన దరఖాస్తులే అత్యధికంగా ఉండటం గమనార్హం. అనంతరం దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, భర్తలేని ఒంటరి మహిళల కేటగిరీల్లో దరఖాస్తులు వచ్చాయి. దీంతో జిల్లాలో సామాజిక భద్రత పింఛన్లపై ఆధారపడుతున్న వర్గాల్లో కొత్తగా అర్హత పొందే వారి సంఖ్య గణనీయంగానే ఉన్నట్లు దరఖాస్తుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

సగానికిపైగా..

11,826 దరఖాస్తుల్లో 6,033 వితంతు పింఛన్లకు సంబంధించినవి. అంటే మొత్తం దరఖాస్తుల్లో సుమారు 51 శాతం ఈ కేటగిరీకి చెందినవే. కుటుంబంలో భర్తను కోల్పోయి ఆర్థిక భద్రత కోసం ప్రభు త్వ సామాజిక భద్రత పథకంపై ఆధారపడే మహిళల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావ డం గణాంకాల్లో ప్రతిబింబించింది. ఇక వితంతు, దివ్యాంగుల కేటగిరీలను కలిపితే 9,052 ద రఖాస్తులు వస్తాయి.

29 వరకు వెరిఫికేషన్‌

కొత్తగా వచ్చిన దరఖాస్తులపై ఈనెల 29వ తేదీ వర కు మండల స్థాయిలో వెరిఫికేషన్‌ కొనసాగనుంది. గెజిటెడ్‌ అధికారి హోదాలో ఉన్న మండల లెవల్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో ఈ పరిశీలన జరగనుంది. దరఖాస్తుదారులు సమర్పించిన వివరాలు, వారు పేర్కొన్న అర్హతలు, ధ్రువపత్రాలను పరిశీలించడంతో పాటు అవసరమైన క్షేత్రస్థాయి వివరాలను కూ డా పరిశీలించ నున్నారు. దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వెరిఫికేషన్‌న్‌ ప్రక్రియ కీలకంగా మారింది. దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ మంజూరు అవుతుందని కాకుండా, నిబంధనల ప్రకారం అర్హత నిర్ధారణ అనంతరం అర్హుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.

అర్హతే కీలకం

ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ పూర్తయి పరిశీలన దశకు చేరుకోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. మండల స్థాయిలో జరిగే వెరిఫికేషన్‌లో అర్హతలు నిర్ధారణ అయిన తర్వాతే తదుపరి ప్రక్రియ ముందుకు సాగనుంది. దీంతో 29వ తేదీ వరకు జరిగే పరిశీలనలో ఎన్ని దరఖాస్తులు అర్హత సాధిస్తాయి.. ఎన్ని అనర్హతకు గురవుతాయి.. ఏ కేటగిరీలో ఎంతమంది అర్హులుగా తేలుతారన్నది కీలకంగా మారింది. వెరిఫికేషన్‌ పూర్తయిన అనంతరం అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను ఆన్‌్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించిన తదుపరి దశకు మార్గం సుగమం కానుంది.

వితంతు పింఛన్లకు అత్యధికం

29 వరకు మండల స్థాయిలో వెరిఫికేషన్‌

అర్హుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు

భర్తలేని ఒంటరి

మహిళలు

వితంతువులు 6,033

6,033

మొత్తం

11,826

596

చేనేత

కార్మికులు

691

1,487

దివ్యాంగులు

3,019

3,019

గీత కార్మికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement