హసన్‌పర్తి: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల కోసం ఆదివారం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్‌కు మిశ్రమ స్పందన లభించింది. వరంగల్ కమిషనరేట్ పరిధి సీకేఎం కళాశాల, హనుమకొండలోని ఎస్‌వీఎస్ కళాశాల, జనగామలోని సీజేఐటీ ఇంజనీరింగ్ కళాశాల(యశ్వంతపురం రోడ్), పరకాలలోని ప్రభుత్వ జూని యర్ కళాశాల, నర్సంపేటలోని బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. మొత్తం 1,966 మంది పేర్లు నమోదు చేసుకుంటే 975 మంది మాత్రమే పరీక్షకు (54.7 శా తం) హాజరయ్యారు. కాగా, పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ శ్వేతతో పాటు డీసీపీలు పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు.
వనజీవి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
బచ్చన్నపేట : చెట్లు నాటడాన్ని ఉద్యమంగా చేపట్టిన వనజీవి రామయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వీరనారి చాకలి అయిలమ్మ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సూర్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో రుగుతున్న వనజీవి రామయ్య చిత్రం చిత్రీకరణలో ఆయ న పాల్గొని మాట్లాడారు.. మండల కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రిలో, వారాంతపు పశువుల సంతలో, పలు దేవాలయాల వద్ద పలు సన్నివేశాలను చిత్రీకరించారని తెలిపారు. ఈ చిత్రానికి దర్శకులుగా వేముగంటి, నిర్మాత నిడిగొండ నరేష్‌కుమార్, వనజీవి పాత్రలో బ్రహ్మాజీ, ఆయన భార్య పాత్రలో నాగరాణి నటిస్తున్నార ని డీఓపీ తోట రమణ, సంగీతం బల్లేపల్లి మోహన్‌లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. చిత్ర బృందం దాసరి రంగన్న, వెంకట్, స్వాతి, వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
భక్తిభావం..
పర్యావరణ వాదం
జనగామ: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో నిర్వాహకులు నూతన ఆలో చనకు శ్రీకారం చు ట్టారు. భక్తి భావా న్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ బైక్‌లను ప్రోత్సహిస్తూ లక్కీ లాటరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని 25వ వార్డు జ్యోతి నగర్ కాలనీ శివ గణేశ్ యూత్, జ్యోతినగర్ కాలనీ గణేశ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోని గణేశ్ ఉత్సవ కమిటీ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గణేశ్ మండపం వద్ద భక్తులు లక్కీ లాటరీకి సంబంధించిన టోకెన్లు తీసు కునేలా ప్రత్యేక విధానాన్ని ఏర్పాటు చేశారు. ‘భక్తి, పర్యావరణ బాధ్యత’ అనే సందేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకా రం అందించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నా రు.


