స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్ కోరారు. ఘన్‌పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి, ఛాగల్లు కలిసి ఘన్‌పూర్ మున్సిపాలిటీగా ఏర్పడిందని, అయితే గత గ్రామ పంచాయతీలో పనిచేసిన 43 మంది పారిశుద్ధ్య సిబ్బంది మాత్రమే ఉన్నారని, అదనంగా కొత్త సిబ్బంది రాలేదన్నారు. మరో ముప్‌పై మందికి పైగా అవసరం ఉందన్నారు. పారిశుద్ధ్య సమస్య పరిష్కారంలో ప్రజలు సహకరించాలని, ఎక్కడ పడితే అక్కడ చెత్త, వ్యర్థాలు వేయవద్దన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ప్లాస్టిక్ కవర్లు, వ్యర్ధాలు డ్రెయినేజీలో వేయొద్దన్నారు.


