న్యూస్‌రీల్
వీర గణనాథుడు
22వ వార్డులో శివసేన యూత్ అసోసియేషనత్ ఆధ్వర్యంలో చేపట్టిన మండపంలో ఆయుధాలు ధరించి ఉగ్రరూపంలో గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ఈ వీర గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కీరావతారంలో వినాయకుడు
పట్టణంలోని 21వ వార్డు యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మండపంలో అర్జునుడిని పరీక్షించడానికి శివుడు వేటగాడి (కిరావతారం) రూపంలో వచ్చిన కథ ఆధారంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. నీలవర్ణ దేహం, నాగాభరణం, చేతిలో విల్లు బాణం, వెనుక అమ్ములపొది, కిరీటంపై శివరూపంతో గణనాథుడు కిరావతారంలో దర్శనమిస్తున్నాడు.


