స్నేహం పేరిట నమ్మక ద్రోహం | - | Sakshi
Sakshi News home page

స్నేహం పేరిట నమ్మక ద్రోహం

Jul 4 2026 2:43 AM | Updated on Jul 4 2026 2:43 AM

స్నేహం పేరిట నమ్మక ద్రోహం

రవి–శిరీష

దంపతులు (ఫైల్‌)

చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన బుడిగె రవి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పదో తరగతితోనే చదువు ఆపేశాడు. ఉన్నత చదువులకు స్వస్తి చెప్పి హైదరాబాద్‌కు వెళ్లి రైస్‌ మిల్లులో గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ రంగంలో అనుభవం వచ్చాక హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఒక బియ్యం దుకాణం పెట్టుకున్నాడు. తర్వాత కేసముద్రం మండలం నాయక్‌పల్లి గ్రామానికి చెందిన శిరీషను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. హయత్‌నగర్‌లో సొంత ఇళ్లు కొనుక్కొని పిల్ల లను చదివిస్తున్నాడు. ఆర్థిక స్వేచ్ఛ సాధించానని సంబరపడుతున్న సమయంలో రవి–శిరీష దంపతులకు కొంత మందితో స్నేహం ఏర్పడింది. అది కాస్త ఫ్యామిలీ ఫ్రెండ్‌షిప్‌లా మారింది. ఓ వ్యక్తి, అతడి భార్య.. రవి, శీరిష దంపతులను తమ వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకుంటామని మాటిచ్చారు. లాభాల ఆశజూపి రూ.15 లక్షలు తీసుకున్నారు. ఎన్ని నెలలు గడిచినా భాగస్వామ్యం ఇవ్వకపోగా.. ప్రశ్నించిన రవి దంపతులను బెదిరించారు. దీంతో తాము మోసపోయామని గ్రహించి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఘట్‌కేసర్‌ బీబీనగర్‌ మధ్యలో ద్విచక్ర వాహనాన్ని చెట్ల పొదల్లో పెట్టి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వారి బంధువులు చెబుతున్నారు.

అమ్మా, నాన్న లేండి..

రవి, శిరీష దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి పిల్లలు తొమ్మిదేళ్ల సుశాంత్‌, ఆరేళ్ల విద్వాన్ష్‌ అనాథలయ్యారు. ‘అమ్మా, నాన్న లేండి’ అంటూ చిన్నారులు రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. తల్లిదండ్రుల మృతితో అనాథలయ్యారు.

భరించలేక మనస్తాపంతో దంపతుల బలవన్మరణం

వ్యాపారం కోసం రూ.15 లక్షలు తీసుకొని మోసం

అనాథలైన వారి ఇద్దరు కుమారులు

చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement