పాలకుర్తి టౌన్: అభం, శుభం తెలియని చిన్నారులపై ఇటీవల కాలంలో అఘాయిత్యాలు పెరిగి పోతున్నాయి. చట్టాలు ఎన్ని ఉన్నా.. మార్పు రావడం లేదు. కొందరు నిందితులకు భయపడి, మరికొందరు పరువు పోతుందని మౌనం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేరగాళ్లను శిక్షించడంతో పాటు ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచేందుకు ప్రత్యేక యాప్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు, లైంగిక దాడులు,అశ్లీల కంటెంట్ వంటి నేరాలపై తక్షణ ఫిర్యాదు స్వీకరించేందుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్‌సీపీసీఆర్) ఆధ్వర్యంలో పోక్సో ఈ–బాక్స్ యాప్ అందుబాటులో ఉంది. ఈ వేదిక ద్వారా పిల్లలు లేదా వారి తరపున తల్లిదండ్రులు, సంక్షరక్షకులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు.
యాప్ పనిచేసేది ఇలా..
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘పోక్సో ఈ–బాక్స్’ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎన్‌సీపీసీఆర్. జీవీఓ,ఇన్ వైబ్‌సైట్‌లో ఽఫిర్యాదు చేయొచ్చు. యాప్ ఓపెన్ కాగానే ‘పోక్సో ఈ బాక్స్’ కనిపిస్తుంది. ఫిర్యాదు ఇచ్చేందుకు క్లిక్ చేస్తే చిన్నారులకు ఎదురయ్యే ఆరు రకాల హింసలకు సంబంధించిన చిత్రాలు కనిపిప్తాయి. హింస స్వభావాన్ని గమనించి దానిపై క్లిక్ చేయాలి. అనంతరం ఫిర్యాదు పేజిలో బాధితులు, ఘటన వివరాలను నమోదు చేసి సబ్మిట్ కొట్టాలి, కేంద్ర ప్రభుత్వం బాలికలకు భరోసా కల్పించేందుకు ఢిల్లీ కేంద్రంగా దీన్ని ప్రారంభించారు. బాధితులు చేసిన ఫిర్యాదులను సంబంఽధిత అధికారులు సీ్త్ర,శిశు సంక్షేమాధికారి రాష్ట్ర కార్యాలయానికి, జిల్లా కేంద్రానికి పంపిస్తారు. బాలల సంరక్షణ సిబ్బంది సహకరించి వెంటనే విచారణ చేపడతారు. క్షేత్రస్ధాయిలో విచారించే అధికారులకు ఫిర్యాదు ఎవరు చేశారన్న సమాచారం తెలియదు. వంద శాతం పారదర్శకతతో విచారణ జరిపి పోలీసుల సహకారంతో కేసు నమోదు చేస్తారు. ఎప్పటికప్పుడు కేసు పురోగతి వివరాలు కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. ఫిర్యాదుదారులకు రక్షణ, నేరానికి పాల్పడిన వారికి శిక్ష పడేలా యంత్రాంగం తోడ్పాటునిస్తుంది.
శిక్షలు ఇలా..
పోక్సో చట్టం–2012 ప్రకారం పిల్లలపై లైంగిక వేధింపులకు 3 సంవత్సరాల వరకు, లైంగిక దాడులకు 5సంవత్సరాల వరకు, తీవ్రమైన లైంగిక దాడి, అత్యాచారం కేసులో 10 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలు విఽధించే అవకాశం ఉంది. ఫిర్యాదుల కోసం 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, సమీప పోలీస్‌సేష్టన్‌లో లేదా పోక్సో ఈ–బాక్స్ యాప్‌ను కూడా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఈ–బాక్స్ యాప్‌తో
నేరాలకు అడ్డుకట్ట
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యాప్‌తో నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చు. దీనిపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. పౌరులకు జరుగుతున్న అన్యాయాన్ని ఇందులో అప్‌లోడ్ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చొరవ చూపాలి. నమోదైన వివరాలను పోలీసుశాఖకు పంపిస్తారు. వాటి ఆధారంగా కేసులు నమోదు చేసి నిందితులకు శిక్షలు పడేలా చేస్తాం.
– జానకీరామ్‌రెడ్డి, సీఐ, పాలకుర్తి
పిల్లలపై లైంగిక వేధింపులకు ఇక చెక్
పోక్సో కేసుల్లో బాధితులకు భరోసా
ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసే అవకాశం
గోప్యతకు పెద్దపీట..నేరాలకు అడ్డుకట్ట


