ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందాం

Jan 11 2026 7:41 AM | Updated on Jan 11 2026 7:41 AM

ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందాం

ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందాం

జనగామ: పేదల వలసలు ఆపేందుకు నాటి యూ పీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకువస్తే, బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కు ట్ర లు పన్నుతుందని డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌ ధ న్వంతి అన్నారు. జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం పేరు మార్పు పేరుతో ఎత్తివేసే కుట్రకు పాల్పడుతోందన్నారు. రాష్ట్రానికి రావాల్సి న ఈజీఎస్‌ నిధులను కేంద్ర ప్రభుత్వం కావాలనే నిలిపివేసి, లక్షలాది మంది గ్రామీణ కూలీల జీవనాధారాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. టీపీసీసీ పిలుపు మేరకు ఈ నెల 26వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఖండిస్తూ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యులు డాక్టర్‌ లక్ష్మీనారాయణ నాయక్‌, ఎర్రమల్ల సుధాకర్‌, సత్యనారాయణరెడ్డి, రాజమౌళి, కల్యాణి, శ్రీనివాస్‌రెడ్డి, ఇందిర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement