‘బాలభారతం’ నాటక వాల్‌పోస్టర్ ఆవిష్క
జనగామ: నెల్లుట్ల ఫౌండేషన్ అనసూయమ్మ లక్ష్మారావు కళాపీఠం, జనగామ గౌతమ్ మోడల్ స్కూల్ సంయుక్త నిర్వహణలో ఈనెల 12న(సోమవారం) హైదరాబాద్ త్యాగరాయ గానసభలో నిర్వహించే రంగస్థల పౌరాణిక పద్య నాటకం బాలభారతం వాల్‌పోస్టర్లను డీసీపీ రాజామహేంద్ర నాయక్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నెల్లుట్ల ఫౌండేషన్ కళాపీఠం వ్యవస్థాపకుడు నెల్లుట్ల రవీందర్‌రావు, స్కూల్ కరస్పాండెంట్ మోతె సురేందర్‌రెడ్డి, సీఐ సత్యనారాయణరెడ్డి, దోర్నాల మనోహర్, రావుల వెంకటేశ్వర్లు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాస్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు షురూ
స్టేషన్‌ఘన్‌పూర్: రాష్ట్ర, జాతీయ క్రీడాపోటీల్లో రాణించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్‌ఐలు వినయ్‌కుమార్, రాజేశ్ అన్నారు. మండలంలోని ఛాగల్లు గ్రామంలో స్వాగత్‌యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ ఖమ్మం జిల్లాల స్థాయి కబడ్డీ క్రీడాపోటీలు ఆదివారం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్‌ఐలు క్రీడాపోటీలు ప్రారంభించారు. అనంతరం కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్, యూత్ గౌరవ అధ్యక్షుడు పోగుల సారంగపాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సమావేశంలో వారు మాట్లాడారు. యువకులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో స్వాగత్‌యూత్ అధ్యక్షుడు కూన రాజు, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సీసీఆర్బీని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని సీసీఆర్బీ కార్యాలయాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదివారం సాయంత్రం తనిఖీ చేశారు. సెక్షన్ల వారీగా పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, వారు నిర్వహిస్తున్న రికార్డులు, అందులో నమోదు చేసిన వివరాలను సంబంధిత సెక్షన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నేరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో అదనపు డీసీపీ రవి, ఏసీపీలు డేవిడ్ రాజు, జనార్దన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, సంజీవ్, మల్లయ్య, ప్రవీణ్ కుమార్, శ్రీని వాస్‌రావు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.
అలరించిన ‘కూచిపూడి’
హన్మకొండ అర్బన్: బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన నృత్య స్రవంతి కూచిపూడి కళాక్షేత్రం 35వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నృత్యస్రవంతి విద్యర్థుల ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయనన్స్ జిల్లా గవర్నర్ కె.చంద్రశేఖర్ ప్రసంగించారు. కూచిపూడికి ఉన్న సంప్రదాయం, సాధన విలువను ఆయన వివరించారు. అనంతరం శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
‘బాలభారతం’ నాటక వాల్‌పోస్టర్ ఆవిష్క


