క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం
జనగామ: క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం వీవర్స్ కాలనీ 11,12 వార్డుల యువకులకు స్థానిక 12వ వార్డు మాజీ కౌన్సిలర్ గుర్రం భూలక్ష్మీనాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలకు ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ 11,12వ వార్డుల అధ్యక్షులు ఎనగందుల కృష్ణ, చిదురాల గణేష్, యూత్ అధ్యక్షుడు గుర్రం ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలన్నీ గులాబీమయం కావాలి
నర్మెట (తరిగొప్పుల): రానున్న ఎన్నికల్లో గ్రామాలన్నీ గులాబీమయం కావాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలకేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు 150 మంది పార్టీలో చేరారు. అనంతరం బొత్తలపర్రె సమ్మక్క–సారలమ్మ జాతర వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో తరిగొప్పుల సర్పంచ్‌గా ఓటమి పాలైన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి దామెర ఽథామస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామెర మైఖేల్ 80 మందితో బీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గద్దల నర్సింగారావు, బొంతగట్టు నాగారం సర్పంచ్ కుర్రె మల్లయ్య , చిలువేరు లింగం, భూక్య జుంలాల్, సుంకరి రాజయ్య, భూక్య రవి, పోచయ్య పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి


