విద్యారంగానికి పెద్దపీట
స్టేషన్‌ఘన్‌పూర్: నియోజకవర్గంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని కేజీబీవీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రూ.7.91 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఆయా పనులకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభించి ఆరు నెలల్లో కేజీబీవీలలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించనున్నట్లు తెలిపారు. లింగాలఘణపురం మండలం మోడల్ స్కూల్‌కు సంబంధించిన బాలికల హాస్టల్ అసంపూర్తిగా ఉందని, త్వరలో సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, బూర్ల శంకర్, అంబటి కిషన్‌రాజ్, నీల గట్టయ్య, కృష్ణమూర్తి, సారంగపాణి, నర్సింహులు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా
త్వరలో జరుగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డులలో విజయకేతనం ఎగురవేయాలని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆదివారం ప్రత్యేక సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అన్ని వార్డులలో 100 శాతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే
కడియం శ్రీహరి


