తిరుమలనాథస్వామి ఆలయ అభివృద్ధికి కృషి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
● ఆలయ నూతన పాలక మండలి ప్రమాణం
స్టేషన్‌ఘన్‌పూర్: నియోజకవర్గ కేంద్రంలోని పురాతన శ్రీతిరుమలనాథ స్వామి దేవాలయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శ్రీతిరుమలనాథ స్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శుక్రవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. దేవస్థాన ఈఓ వంశీచే ఆలయ కమిటీ చైర్మన్‌గా నీల నర్సింహులు, డైరెక్టర్లుగా తాటికొండ యాదగిరి, గట్టు ప్రశాంత్, మునిగెల కుమారస్వామి, గుగులోతు లత, సభ్యులుగా పూజారి రామానుజచార్యులుచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన పాలక మండలి చైర్మన్, డైరెక్టర్లను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన వసతి, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసేలా కమిటీ కృషి చేయాలన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూలకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, నాయకులు బెలిదె వెంక న్న, శ్రీధర్‌రావు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


