తాగేశారు
న్యూ ఇయర్ వేడుకల్లో రూ.18.61కోట్ల మద్యం అమ్మకాలు
జనగామ: నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. సాధారణంగా డిసెంబర్ 31, జనవరి 1న మాత్రమే ఎక్కువగా అమ్మకాలు నమోదవుతుంటాయి. ఈసారి వేడుకలకు మూడు రోజుల ముందే ప్రారంభించిన యువత, మద్యం ప్రియులు భారీగా మద్యం కొనుగోలు చేయడంతో ఎకై ్సజ్ శాఖ ఖజానా గణనీయంగా పెరిగింది. మూడు రోజుల్లో 2025 డిసెంబర్ 30, 31, 2026 జనవరి 1 తేదీల్లో రూ.18.61 కోట్ల విలువైన బీర్, లిక్కర్‌పై విక్రయాలు జరగడం జిల్లాలో ఇంత వరకు లేని రికార్డుగా నిలిచింది.
జిల్లాలో 27,997 బీర్ కేసులు, లిక్కర్ కాటన్లు అమ్ముడుపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 50 వైన్స్, 5 బార్ల యజమానులకు ఈసారి నూతన సంవత్సరం, ముందుగానే అంచనా వేసిన దానికంటే ఎక్కువ లాభాలను అందించింది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలు, ఇప్పుడు నూతన సంవత్సరం వేడుకలు, రాబోయే సంక్రాంతి పండగ కొత్తగా లైసెన్స్ పొందిన షాపుల యజమానులకు ఊరటనిచ్చే పరిణామంగా చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరం పురస్కరించుకుని ప్రభుత్వం డిసెంబర్ 31 రాత్రి ప్రత్యేక అనుమతిగా వైన్స్ షాపులకు రాత్రి 12గంటల వరకు, బార్లకు అర్ధరాత్రి 1 గంట వరకు అమ్ముకునే అవకాశం ఇవ్వడంతో కొనుగోళ్లు మరింత పెరిగాయి. సమూహాలుగా చేరి పార్టీలు, ఫ్రెండ్స్ గ్యాదరింగ్, కుటుంబ వేడుకలు అన్నీ కలిపి మద్యం సేల్స్ పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. గతేడాది ఇదే సమయంలో రూ.10.43 కోట్లు మాత్రమే అమ్మకాలు జరగగా, ఈసారి రూ.8కోట్ల మేర పెరిగి రూ.18.61 కోట్ల సేల్స్ నమోదవడం గ మనార్హం.
మండల కేంద్రాల్లోని ప్రభుత్వ దుకాణాలతో పాటు పలుచోట్ల గ్రామాల్లో బెల్ట్‌షాపులు కూడా జోరు మీద వ్యాపారం సాగించాయి. ఈ భారీ అమ్మకాలు ఎకై ్సజ్ శాఖకు ఊహించని ఆదాయాన్ని అందించాయి. ఇదిలా ఉండగా, మద్యం తాగి వాహనాలు నడపరాదని పోలీస్ శాఖ ముందుగానే హెచ్చరించినప్పటికీ 80 మంది డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డారు. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే వేడుకల్లో మద్యం వినియోగం భారీగా పెరిగినప్పటికీ, అధికారులు భద్రతపరమైన అంశాలపై ప్రజలు మరింత శ్రద్ధ చూపాలని సూచించడంతో రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గాయి. జిల్లా మద్యం సేల్స్‌లో వచ్చిన ఈ పెరుగుదల రాబోయే సంక్రాంతి పండుగ సమయంలో మరింత బిజినెస్‌కు దారి తీయవచ్చని వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గతేడాదితో పోలిస్తే రూ.8కోట్లు పెరుగుదల
కలిసి వచ్చిన ప్రత్యేక సమయం అనుమతులు
మూడు రోజుల్లో 27,997 కాటన్లు ఖాళీ!
డిసెంబర్ 30 నుంచి జనవరి 1వ తేదీ వరకు మద్యం అమ్మకాలు(కాటన్లలో)
తేదీ ఐఎంఎల్ బీర్లు మొత్తం సేల్
30, 01 17,211 10,786 27,997 రూ.18.61కోట్లు
తాగేశారు
తాగేశారు


