ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025

Aug 24 2025 8:17 AM | Updated on Aug 24 2025 8:17 AM

ఆదివా

ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025

– 8లోu

న్యూస్‌రీల్‌

పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగానే చిరునవ్వుతో ఆహ్వానించే ఓ రిసెప్షనిస్ట్‌. అక్రమార్కుల తాట తీసే ఓ టాస్క్‌ఫోర్స్‌ టీం మెంబర్‌. ఇలా శాఖలోని అన్ని విభాగాల్లో ముందుంటున్నారు మహిళా పోలీసులు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో అందరూ సమానమే అనేలా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్నాళ్లు కొన్ని విధులకే పరిమితమైన వారంతా ఉన్నతాధికారుల నిర్ణయాలతో రోడ్డెక్కి విధులు నిర్వహిస్తున్నారు. ‘మీ భద్రతే మా బాధ్యత’ అంటూ రాత్రిళ్లు సైతం విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపై ‘సాక్షి’ సండే స్పెషల్‌ స్టోరీ.

– వరంగల్‌ క్రైం

పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగానే చిరునవ్వుతో ఆహ్వానించే ఓ రిసెప్షనిస్ట్‌. అక్రమార్కుల తాట తీసే ఓ టాస్క్‌ఫోర్స్‌ టీం మెంబర్‌. ఇలా శాఖలోని అన్ని విభాగాల్లో ముందుంటున్నారు మహిళా పోలీసులు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో అందరూ సమానమే అనేలా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్నాళ్లు కొన్ని విధులకే పరిమితమైన వారంతా ఉన్నతాధికారుల నిర్ణయాలతో రోడ్డెక్కి విధులు నిర్వహిస్తున్నారు. ‘మీ భద్రతే మా బాధ్యత’ అంటూ రాత్రిళ్లు సైతం విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపై ‘సాక్షి’ సండే స్పెషల్‌ స్టోరీ.

– వరంగల్‌ క్రైం

కమిషనరేట్‌లో

మహిళా అధికారులు ఇలా..

సీఐ

2

ఏఎస్సై,

హెడ్‌కానిస్టేబుళ్లు 245

కానిస్టేబుళ్లు 352

హోంగార్డులు 70

ఆర్మీకి దీటుగా విధులు..

పోలీస్‌ శాఖలో అందరూ సమానమే అనేలా పురుషులతో సమానంగా మహిళా అధికారులతో విధులు చేయిస్తున్నాం. ఆర్మీలో పురుషులతో సమానంగా అన్ని రకాల విధులు మహిళా అధికారులు చేస్తున్నారు. అదే స్ఫూర్తితో ఇక్కడ డ్యూటీలు వేస్తున్నాం. ఏ డ్యూటీ వేసిన వారు చక్కగా రాణిస్తున్నారు. గతంలో కూడా అన్ని రకాల డ్యూటీలను మహిళా అధికారులు చేశారు. ప్రస్తుతం మరోసారి వారు అన్ని రకాల విధుల్లో రాణిస్తున్నారు.

– సన్‌ప్రీత్‌సింగ్‌,

పోలీస్‌ కమిషనర్‌, వరంగల్‌

యల్‌ 100 కాల్స్‌ మొదలుకుని కష్టతరమైన ఫిర్యాదుల విచారణకు సైతం మహిళా పోలీసులు సై అంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పురుషులతో సమానంగా స్వీకరిస్తూ రంగంలోకి దిగుతున్నారు. విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా బ్లూకోల్ట్‌ విధుల్లో పురుషులతో కలిసి సమర్థంగా రాణిస్తున్నారు. రాత్రిపూట పెట్రోలింగ్‌ విధుల్లో భాగస్వామ్యమవుతున్నారు. మహిళా నేరస్తులను జైళ్లకు తరలించే క్రమంలో ఎస్కార్ట్‌గా, నేతల సభలకు షార్ట్‌ వెపన్లతో హాజరై సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు.

కష్టతరమైనప్పటికీ విధులకు..

సాధారణంగా పోలీస్‌ స్టేషన్లలో రూల్‌కాల్‌ ఉదయం 9 గంటలకు చేపడుతున్నారు. అప్పటి నుంచి 2 గంటల వరకు విధులు నిర్వహించి.. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు డ్యూటీలో కొనసాగుతున్నారు. రాత్రి డ్యూటీ ఉన్నవారు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. రిసెప్షన్‌ విధులు నిర్వహించే మహిళలు ఉదయం 9 నుంచి 2 గంటల వరకు డ్యూటీలో ఉంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి 9 గంటల వరకు మరొకరు విధులు చేపడుతున్నారు. వీరికి 24 గంటల పాటు రెస్ట్‌ దొరుకుతుంది.

హుషారుగా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో..

మహిళా పోలీస్‌ అధికారులు అత్యంత హుషారుగా ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను వేతనంతో పాటు 30 శాతం అదనంగా చెల్లిస్తారు. దీనికి తోడు ఉన్నత అధికారుల నుంచి విధులకు సంబంధించి ఎలాంటి ఒత్తిళ్లు లేకపోవడంతో ట్రాఫిక్‌ విధుల్లో మక్కువ చూపిస్తున్నారు. ప్రస్తుతం ట్రైసిటీ పరిధి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లలో ఒక ఇన్‌స్పెక్టర్‌, ముగ్గురు ఏఎస్సైలు, ముగ్గురు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లు, ఒకరు హోంగార్డు విధుల్లో కొనసాగుతున్నారు.

చాలెంజింగ్‌ విధులు...

రాత్రిపూట విధులు నిర్వహించడం మహిళా పోలీసులకు చాలెంజింగ్‌ మారింది. బ్లూకోల్ట్‌ సిబ్బందితో సమానంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిర్దేశించిన డ్యూటీని నిర్వహిస్తున్నారు. ఆయా పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో ఉన్న హాస్టళ్ల పరిసరాలను పరిశీలించడంతోపాటు బార్‌అండ్‌రెస్టారెంట్ల దగ్గర ఎదురయ్యే ఆకతాయిల గొడవలు మొదలు కొని, అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో బ్యాగులు, తదితర వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం, రౌడీ షీటర్ల ఇళ్లను సందర్శించి ఉన్నారో, లేదో తెలుసుకోవడం, రాత్రి పూట నిర్వహించే వ్యాపారాలను బంద్‌ చేసి ఎక్కడా చిన్న ఘటన జరగకుండా చూసుకోవడం చేస్తున్నారు. దీంతోపాటు ఏదైనా లాఅండ్‌ఆర్డర్‌కు సంబంధించి పెద్ద సంఘటన జరిగితే వెంటనే బ్లూకోల్ట్‌ సిబ్బంది సహకారం తీసుకుని పరిష్కరిస్తున్నారు.

డీసీపీ 1

రాత్రిపూట మహిళా పోలీసుల పెట్రోలింగ్‌

కూడళ్లు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్లలో తనిఖీలు

పురుషులతో సమానంగా విధులు

వరంగల్‌ కమిషనరేట్‌లో తమదైన మార్క్‌

ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 20251
1/4

ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025

ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 20252
2/4

ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025

ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 20253
3/4

ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025

ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 20254
4/4

ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement