
విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి
● అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్
రఘునాథపల్లి: విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్‌కుమార్ తెలిపారు. శనివారం మండలంలోని ఖిలాషాపూర్ జెడ్పీ పాఠశాలను పరిశీలించి తాగునీరు, కొత్త బోరు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల మరమ్మతు, వాలీబాల్ గ్రౌండ్, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. తరగతి గదులను పరిశీలించి కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లను ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. అలాగే ప్రాథమిక పాఠశాలను సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రఘునాథపల్లిలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, ఏఎంఓ శ్రీనివాస్, ఏడీ మూర్తి, సీఎంఓ నాగరాజు, ఎంఈఓ రఘుందన్‌రెడ్డి, ఏఈ భరత్, హెచ్‌ఎంలు భారత రవీందర్, యాదవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.