
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ
జనగామ: అన్నా చెల్లెల్లు, అక్కా త మ్ముళ్ల అనుబంధానికి ప్రతీక జరుపుకునే రాఖీపౌర్ణమి వేడుకలను శనివా రం జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. సోదరులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెల్లి రాఖీ కడితే, కట్నకానుకలు ఇచ్చి సౌభాగ్యంగా ఉండాలని దీవించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆడపడుచులతో ఇళ్లలో సందడి నెలకొంది. చిన్ననాటి స్నేహితులు సైతం స్నేహానికి గుర్తుగా పండుగ వేడుకలు జరుపుకున్నారు. రక్షాబంధన్ పర్వదినం పురస్కరించుకుని మిఠాయి దుకాణాలు, పూలు, వస్త్ర వ్యాపార దుకాణాల్లో వ్యాపారాలు జోరుగా సాగాయి. పట్టణంలోని బాణాపురం శ్రీ వేంకటేశ్వర, శ్రీ సంతోషిమాత, చెన్నకేశ్వర, గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వర, ఉప్పలమ్మ సహిత ఆంజనేయ, జ్ఞానసరస్వతీ, సాయిబాబా, పోషమ్మ, రేణుక ఎల్లమ్మ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అనంతరం అమ్మవారి పాదాల వద్ద రాఖీలతో చల్లగా దీవించు తల్లీ అంటూ వేడుకున్నారు. కాగా ఆర్టీసీ బస్సులో విధులు నిర్వర్తిస్తున్న జనగామ పట్టణానికి చెందిన సోదరుడి (కండక్టర్)కి గందమల్ల లక్ష్మి (సోదరి) బస్సులోనే రాఖీ కట్టింది.
ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ