మా సమస్యలు పరిష్కారమయ్యేనా..?
జనగామ రూరల్: కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌లో సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలి తం లేదని, తిరుగుడు తప్ప పరిష్కారం కావడంలేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సుమారు 74 వినతులు స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బా షా సైతం గ్రీవెన్స్‌లో వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారంపై అధికారులు, సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రో హిత్ సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, స్టేషన్ ఘనపూర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హనుమాన్ నాయక్, డిప్యూటీ జెడ్పీ సీఈఓ సరిత, డీ ఆర్డీఓ వసంత, డీఏఓ రామారావు నాయక్, డీసీ ఎస్‌ఓ సరస్వతి, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని ఇలా..
● దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడేనికి చెందిన నాగిడి మల్లారెడ్డి హాస్పిటల్‌కి వెళ్లిన సమయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేశారు. మళ్లీ సర్వే చేసి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు.
● రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామం చెందిన జట్టి వెంకటయ్య, తన 4.5 ఎకరాల వ్యవసాయ భూమికి దారి లేక ఇబ్బంది పడుతున్నానని పరిష్కారం చూపాలని కోరాడు.
● బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ గ్రామం చెందిన గీస పోశమ్మ తనకు ఎలాంటి పనిలేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉండని వృద్ధాప్య ఫించన్ మంజూరు చేయాలని కోరింది.
● జనగామ మండలం మరిగడి పరిధిలోని టాక్యతండాకు చెందిన రామావత్ శంకర్ తమ ఊరిలో మిషన్ భగీరథ ద్వారా నీరు రావడం లేదని, తండాకు నీరందించాలని కోరాడు.
గ్రీవెన్స్‌లో బాధితుల ఆవేదన
ప్రజల నుంచి 74 వినతుల స్వీకరణ


