మత్తు పదార్థాల నియంత్రణపై దృష్టి పెట్టాలి
జనగామ: గంజాయి, మత్తు పదార్థాల క్రయ విక్రయాల నియంత్రణపై స్టేషన్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. స్థానిక ఏసీపీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన వెస్ట్‌జోన్ పోలీసు అధికా రుల సమావేశ ప్రాంగణాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి పండ్ల మొక్కలు నాటి నీరు పోశా రు. అక్కడి నుంచి వెస్ట్‌జోన్‌న్ పరిధి జనగామ పోలీస్‌స్టేషన్‌తో పాటు డీసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలు, బ్లూకోల్ట్స్ సిబ్బంది పనితీరు, రౌడీ షీటర్లు, నమోదవుతున్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. ప్రతి స్టేషన్ అధికారి తప్పనిసరిగా రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి వారి ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయాలని సూచించారు. ఆర్థిక, సైబర్ నేరాలకు సంబంధించి నేరస్తుల మూలాలను సైతం దర్యాప్తులో కనిపెట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనగామ ఏఎస్పీ చైతన్య నితిన్ పండేరీ, ఏసీపీలు భీంశర్మ, నర్సయ్య, సీఐలు దామోదర్‌రెడ్డి, అబ్బయ్య, శ్రీనివాస్, ఎస్సైలు పాల్గొన్నారు.
విజుబుల్ పోలిసింగ్ అవసరం
చిల్పూరు: నేరాల నియంత్రణకు విజుబుల్ పోలీ సింగ్ అవసరం.. ఇందుకు పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. సీపీగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి పోలీస్‌స్టేషన్‌ను ఆయన శుక్రవారం సందర్శించారు. జనగామ రూరల్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నవీన్‌కుమార్ సీపీకి పూలబొకె అందజేశారు. అనంతరం ఆయన మొక్క నాటారు.
చెక్‌పోస్టును పరిశీలించిన సీపీ
లింగాలఘణపురం : మండల పరిధిలోని కుందారం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును శుక్రవారం వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ పరిశీలించారు.
రౌడీ షీటర్ల ఇళ్లను సందర్శించాలి
సైబర్ నేరస్తుల మూలాలను కనిపెట్టాలి
వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్


