
తగ్గిన ఆర్టీసీ బస్సుల అద్దె
జనగామ: ఆర్టీసీ బస్సుల అద్దె(కిలోమీటర్ చార్జీలు) తగ్గిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో వివాహాది శుభకార్యాల సమయంలో సామా న్య, పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుంది. ప్రైవేట్ నుంచి పోటీని తట్టుకుని మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు సంస్థ ఈ చర్యలు చేపట్టింది. జనగామ డిపో పరిధిలో 42 రూట్ల లో రోజువారీగా ప్రయాణికులకు సేవలందిస్తూనే వివాహాది శుభకార్యాలు, విహార యాత్రలకు బస్సులను అద్దెకు ఇస్తూ ఆదాయాన్ని గడిస్తోంది.
ఆర్టీసీ సేవలను సద్వినియోగం
చేసుకోండి
శుభకార్యాలు, విహార యాత్రలకు ఆర్టీసీ బస్సుల అద్దె సేవలను సద్వినియోగం చేసుకోవాలి. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకు గతంలో ఉన్న కిలోమీటరు చార్జీల్లో కొంత తగ్గించాం. విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. సురక్షిత ప్రయాణం, క్షేమంగా గమ్యానికి చేర్చడం మా లక్ష్యం.
– స్వాతి, జనగామ డిపో మేనేజర్
ఆర్టీసీ బస్సుల అద్దె చార్జీలు
(కిలో మీటరుకు)
బస్సు కేటగిరీలు సీట్లు గతంలో ప్రస్తుతం
పల్లె వెలుగు 55 రూ.68 రూ.57
పల్లె వెలుగు 59 రూ.69 రూ.61
ఎక్స్‌ప్రెస్ 50 రూ.69 రూ.62
ఎక్స్‌ప్రెస్ 55 రూ.69 రూ.68
డీలక్స్ 40 రూ.65 రూ.57