మక్క విత్తుతున్నారా..! | - | Sakshi
Sakshi News home page

మక్క విత్తుతున్నారా..!

Nov 20 2026 12:43 AM | Updated on Nov 20 2026 12:43 AM

జగిత్యాలఅగ్రికల్చర్‌: కొయ్యకాళ్లలో మక్కలు విత్తేందుకు పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం మాజీ డైరెక్టర్‌ కిషన్‌ రెడ్డి కొత్త పరికరానికి రూపకల్పన చేశారు. ఇందులో రెండు చక్రాలు రెండడుగుల దూరంలో ఉంటాయి. ప్రతి చక్రానికి మొనతో కూడిన 9 అంగుళాల ఇనుప ముక్కలు వెల్డింగ్‌ చేస్తారు. హ్యాండిల్‌తో నెట్టుకుంటూ వెళ్తే ఇనుపముక్కలు భూమిలో రంధ్రాలు చేస్తాయి. కూలీలు విత్తనాలు వేసి.. మట్టి వేసుకుంటే వెళ్తే సరిపోతుంది. ఈ పరికరాన్ని వెల్డింగ్‌ షాపులో తయారు చేయించుకోవచ్చు. రూ.4వేల నుంచి రూ.6వేల ఖర్చయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement