వృథాగా తాగునీరు.. | - | Sakshi
Sakshi News home page

వృథాగా తాగునీరు..

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివారులో ఆగిఉన్న లారీని ఢీకొని చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన తమ్మనవేని శ్రీనాథ్‌(27) మరణించినట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. ఎస్సై, స్థానికుల కథనం ప్రకారంగా.. రాగంపేట గ్రామానికి చెందిన తమ్మనవేని లక్ష్మి– మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు శ్రీనాథ్‌ మంచిర్యాల జిల్లా చెన్నూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగి. రెండు రోజుల క్రితం మరోబ్యాంకులో ఉద్యోగం సాధించాడు. జగిత్యాలలో పనిచేస్తూ రాగంపేటలోని తన ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిపోతున్నాడు. ఈ క్రమంలో విధులు ముగించుకుని సోమవారం సాయంత్రం స్వగ్రామానికి బయలు దేరాడు. ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోకి రాగానే రోడ్డుపక్కన నిర్లక్ష్యంగా పార్కింగ్‌ చేసిన మహారాష్ట్రకు చెందిన లారీని చీకట్లో కనిపించక ఢీకొన్నాడు. తీవ్రగాయాలు కాగా 108లో కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

రాయికల్‌: ఎల్‌నినో ప్రభావంతో నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ రాయికల్‌ మున్సిపల్‌ అధికారులు మాత్రం అవేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రాయికల్‌ పట్టణంలోని కోరుట్ల క్రాసింగ్‌ రోడ్‌, ఇటిక్యాల క్రాసింగ్‌రోడ్‌, గాంధీచౌక్‌తో పాటు, పలు వార్డుల్లో నల్లా పైపులకు ఆన్‌/ఆఫ్‌ లేకపోవడంతో తాగునీరంతా నీరంతా వృథాగా పోతోంది. ఇప్పటికై నా మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌గౌడ్‌, పాలకవర్గ సభ్యులు స్పందించి వృథాగా పోతు న్న నీటిని నియత్రించాలని, పైపులకు నల్లాలు బిగించాలని ప్రజలు కోరుతున్నారు.

ఆగిఉన్న లారీని ఢీకొని యువకుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement