మెట్‌పల్లిరూరల్: సంయుక్త సర్వేతోనే రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మెట్‌పల్లి ఆర్డీవో నర్సింహరావు అన్నారు. మెట్‌పల్లి మండలం రంగారావుపేట, అల్లూరి సీతరామరాజుతండా(ఏఎస్‌ఆర్ తండా) శివారులోని రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దుల సర్వేకు మంగళవారం రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు వెళ్లారు. ఏఎస్‌ఆర్‌తండావాసులు సర్వే విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు సమాచారం లేకుండా సర్వే చేయొద్దని.. గ్రామస్థులమంతా సమావేశం ఏర్పాటు చేసుకుంటామని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూసమస్యలకు సర్వేతో పరిష్కారం అవుతుందని, ఎవరికీ నష్టం జరగకుండానే సర్వే జరుగుతోందని ఆర్డీవో స్పష్టం చేశారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు ఉండడంతోనే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. చివరిగా అధికారులు సర్వే చేయకుండానే వెనుదిరిగారు. డీఎఫ్‌వో రవిప్రసాద్, ఎఫ్‌ఆర్వో పద్మారావు, తహసీల్దార్ ముఫ్తార్‌పాషా, ఆర్‌ఐ సంధ్యారాణి, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.


