మట్టి రవాణా చేసిన వాహనాలకు జరిమానా | - | Sakshi
Sakshi News home page

మట్టి రవాణా చేసిన వాహనాలకు జరిమానా

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

● నాలుగు టిప్పర్లు, ఒక పొక్లెయిన్‌కు ఫైన్‌ ● సీజ్‌ చేసిన టిప్పర్లలో ఒకటి మాయం.. పోలీసులకు ఫిర్యాదు ● అనుమతుల్లేకుండా తవ్వితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

గొల్లపల్లి: మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వాహనాలకు మంగళవారం జరిమానా విధించినట్లు తహసీల్దార్‌ ఎండీ.మజీద్‌ వెల్లడించారు. మండల కేంద్రంలోని భీమునిగుట్ట (క్రషర్‌ గుట్ట), నల్లగుట్ట ప్రాంతాల్లో రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా మట్టి తవ్వకాలు సాగిస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు గత శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించిన విషయం తెల్సిందే. అబ్బాపూర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేట్‌ రైస్‌మిల్లు పూడ్చివేత కోసం మైనింగ్‌ ఎన్‌వోసీ తీసుకోకుండా.. సీనరేజ్‌ రుసుము చెల్లించకుండా తరలిస్తున్న నాలుగు టిప్పర్లు, ఒక పొక్లెయిన్‌ను అధికారులు ఘటనా స్థలంలో పట్టుకుని సీజ్‌ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు నిబంధనల ప్రకారం వాహనాలకు జరిమానా విధించినట్లు తహసీల్దార్‌ తెలిపారు. సీజ్‌ చేసిన వాహనాల్లో నుంచి ఒక టిప్పర్‌ను తీసుకెళ్లినట్లు గుర్తించామని, ఈ ఘటనపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌తో పాటు జిల్లా రవాణా శాఖ (డీటీఓ) అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. మండల పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా చెరువులు, గుట్టల నుంచి మట్టి తవ్వకాలు జరిపినా.. తరలించినా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement