సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో మెజార్టీ సామాజిక వర్గం పద్మశాలీలు. కోటీశ్వరులైనా, సామా న్య మధ్యతరగతి వారైనా వారింట్లో జరిగే పెళ్లిలో శాకాహార భోజనమే పెడుతారు. మూ డున్నర దశాబ్దాలుగా ఇక్కడి పద్మశాలి సమాజం ఆచరిస్తున్న సంప్రదాయం. 1990లో మొ దలైన ఈ విధానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నా రు. పెళ్లి జరిగే ఇంట్లో హోమం ఉంటుంది కాబ ట్టి మాంసాహారం ముట్టకూడదన్న కులపెద్దల నిర్ణయం మేరకు పెళ్లిలో మాంసాహారన్ని ని షేధించారు. ఆర్థికంగా ఉన్నవారు పెళ్లిలో శా కాహారం పెట్టి, మరుసటి రోజు లేదా.. ఇంకో రోజు విందులో మాంసాహారాన్ని వడ్డిస్తున్నారు.


